IND vs AUS: పింక్ టెస్టులో టీమిండియా పరువు కాపాడిన తెలుగు కుర్రోడు!
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు అడిలైడ్ వేదికగా జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పేలవమైన పదర్శన కనబరిచింది. కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ ఫాస్ట్ బౌలింగ్ ముందు భారత బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు నిలవలేకపోయారు. జైస్వాల్ నుంచి మొదలైన ఈ వికెట్ల క్రమం కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి చివరి బ్యాటర్ వరకు కొనసాగింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా స్టార్ బౌలింగ్‌ను హ్యాండిల్ చేయలేకపోయారు.
టాప్ స్కోరర్‌గా నితీశ్
అయితే తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి మాత్రం ఈ ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 54 బంతుల్లో 42 పరుగులతో ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రెడ్డి టీమ్ ఇండియాను ఆదుకున్నాడు. అతడికి తోడు అశ్విన్ 22 పరుగులు చేసి జట్టుకు కొంత మద్దతు ఇచ్చాడు. 6 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ భారత జట్టుకు అతిపెద్ద గాయం చేశాడు. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీసి మెరిపించారు.