IPL 2025 Auction: నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం.. !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) రిటెన్షన్ ముగిసింది. ఇక, మెగా వేలం ఎప్పుడు? ఎక్కడ నిర్వహిస్తారన్నది ఆసక్తిగా మారింది. దుబాయ్ వేదికగా క్రితం సారి వేలం పాట జరిగింది. ఈసారి మాత్రం సౌదీ అరేబియా రాజధాని రియాద్ వేదికగా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆక్షన్‌ను నవంబర్ 24, 25 తేదీల్లో నిర్వహించే ఛాన్స్ ఉందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అయితే, అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
అందరి దృష్టి పంత్‌పైనే!
నవంబర్ 22 నుంచి భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు మధ్యలోనే ఐపీఎల్ వేలం నిర్వహిస్తారని తెలుస్తోంది. డిస్నీ హాట్‌స్టార్ వేదికగా ఆక్షన్‌ను ప్రత్యక్షప్రసారం కానుంది. ఆసీస్ టైమింగ్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా.. రియాద్‌లో మధ్యాహ్నం సమయంలో వేలం నిర్వహిస్తారని సమాచారం. ఈసారి ఐపీఎల్ మెగా వేలంపై ఆసక్తి పెరిగిపోవడానికి కారణం భారత స్టార్లు ఉండటమే. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, సిరాజ్ తదితరులు తమ లక్‌ను పరీక్షించుకోనున్నారు. దూకుడు మీదున్న రిషభ్‌ను ఎవరు సొంతం చేసుకుంటారనే దానిపైనే అభిమానుల దృష్టి ఉంది. వేలంలో భారీ మొత్తం అతడే సొంతం చేసుకుంటాడనే అంచనాలు ఉన్నాయి.