తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL-2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంలో చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్!

ఐపీఎల్ మెగా వేలంలో భారత ప్లేయర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించారు. రిషబ్ పంత్‌పై లక్నో సూపర్ జెయింట్స్ కాసుల వర్షం కురిపించింది. అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచారూ. రూ. 27 కోట్లకు పంత్‌ను లక్నో సొంతం చేసుకుంది. పంత్ కోసం లక్నో, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లక్నో రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది. ఇక, మరో స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్‌ కూడా భారీ ధర పలికారు. శ్రేయస్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది. తొలుత అయ్యర్ కోసం కోల్‌కతా, ఢిల్లీ పోటీ పడ్డాయి. తర్వాత పంజాబ్‌ రేసులోకి వచ్చింది. చివరకు రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్‌ సొంతం చేసుకుంది.

భారీ ధర పలికిన ఆటగాళ్లు!

  • టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్‌ను రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
  • టీమ్‌ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రూ.18 కోట్లకు పంజాబ్‌ సొంతం చేసుకుంది.
  • ఇంగ్లాండ్ బ్యాటర్‌ జోస్ బట్లర్‌ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
  • టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ని రూ.12.25 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.
  • సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడను రూ.10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌ సొంతం చేసుకుంది.
  • మహ్మద్‌ షమిని రూ.10 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ దక్కించుకుంది.
  • సౌతాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ను రూ.7.5 కోట్లకు లఖ్‌నవూ సొంతం చేసుకుంది.
  • టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button