తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL Mega Auction: నేడే ఐపీఎల్ మెగా వేలం.. అందరి చూపు పంత్ పైనే!

దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3. 30 గంటలకు సౌదీ అరేబియాలోని జెడ్డాలో ప్రారంభం కానుంది. ఈ మెగా వేలం ఇవాళ, రేపు కొనసాగనుంది. ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా అందరి దృష్టి టీమిండియా కీపర్‌‌‌‌‌‌‌‌, స్టార్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌పైనే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసిన పంత్‌‌‌‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు అన్ని ఫ్రాంచైజీల మధ్య బిడ్డింగ్ వార్‌‌‌‌‌‌‌‌ నడిచే అవకాశం కనిపిస్తోంది. దాంతో పంత్ రూ. 25 కోట్ల మార్కును దాటి లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారే ఛాన్స్ ఉంది.

రిషబ్ కోసం గట్టి పోటీ!

మొత్తంగా 204 స్లాట్స్ ఖాళీగా ఉండగా.. రిటెన్షన్స్ తర్వాత అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 641.5 కోట్ల మొత్తం మిగిలుంది. పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ (రూ. 83 కోట్లు), డీసీ (రూ. 73 కోట్ల)ల వద్ద కూడా పెద్ద మొత్తం ఉంది. ఈ మూడు ఫ్రాంచైజీలు పంత్‌‌‌‌ కోసం పోటీ పడొచ్చు. రిషబ్‌‌‌‌తో పాటు శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌, కేఎల్ రాహుల్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్ సింగ్‌‌‌‌.. విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్‌‌‌‌‌‌‌‌, లియామ్ లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌, కగిసో రబాడ భారీ మొత్తం పలికే అవకాశం కనిపిస్తోంది. తొలి సెట్‌‌‌‌లోనే పంత్‌‌‌‌, బట్లర్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, రబాడ, స్టార్క్‌‌‌‌ పేర్లు ఉన్న నేపథ్యంలో వేలం ఆరంభంలోనే బిడ్డింగ్ వార్ మొదలవనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button