తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Ishan Kishan: బాల్ టాంపరింగ్ ఆరోపణలు.. వివాదంలో ఇషాన్ కిషన్!

భారత క్రికెటర్లలో అత్యంత ప్రతిభావంతమైన వికెట్ కీపర్లలో ఇషాన్ కిషన్ ఒకరు. అయితే ఈ మధ్య కాలంలో అతను తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా-ఏ, ఇండియా-ఏ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బంతి మార్పుపై అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. మార్చిన బంతితోనే ఆడాలని ఆంపైర్ చెప్పగా.. ఇషాన్ కిషన్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తెలివి తక్కువ నిర్ణయం అంటూ కామెంట్ చేశారు.

వేటు పడుతుందా?

బంతి మార్పుపై భారత ఆటగాళ్లు అడుగుతున్న సమయంలో అంపైర్ స్పందిస్తూ.. ‘చర్చలకు తావులేదు. వెళ్లి ఆడండి. ఇక్కడేమీ చర్చా కార్యక్రమం జరగడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఇషాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మేం ఇదే బంతితో ఆడాలా? మీ నిర్ణయం అత్యంత మూర్ఖత్వం’ అని అన్నారు. ‘మీ వల్లే బంతి పాడైంది. నువ్వే (ఇషాన్‌ను ఉద్దేశించి) స్క్రాచ్‌ చేశావు. అందుకే బంతిని మార్చాం. కేవలం మీ చర్యల వల్లే బంతి మార్పు జరిగింది’ అని అంపైర్ వెల్లడించారు. ఈ క్రమంలో టాంపరింగ్‌ ఆరోపణలు నిజమైతే భారత ఏ ఆటగాళ్లపై వేటు పడే అవకాశం లేకపోలేదు. దీనిపై ఇటు క్రికెట్ ఆస్ట్రేలియా లేదా బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button