తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Joe Root: సచిన్ రికార్డును అధిగమించిన ఒకే ఒక్కడు!

ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ తెండూల్కర్ (1625 పరుగులు) పేరిట ఉండేది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో రూట్ 23 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించారు. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకోగా.. జో రూట్ కేవలం 49 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించారు. ఇప్పటివరకు 150 టెస్టులు ఆడిన అతడు.. 12,777 పరుగులు చేశారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎక్కువ రన్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నారు.

టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

జో రూట్ – 1630 (49 ఇన్నింగ్స్‌లు)
సచిన్ తెందూల్కర్ – 1625 (60 ఇన్నింగ్స్‌లు)
అలిస్టర్ కుక్ – 1611 (53 ఇన్నింగ్స్‌లు)
గ్రేమ్ స్మిత్ – 1611 (41 ఇన్నింగ్స్‌లు)
శివనారాయణ్ చందర్‌పాల్ – 1580 (49 ఇన్నింగ్స్‌లు)

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button