తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Mohammed Siraj: బాలీవుడ్ సింగర్‌తో డేటింగ్ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన మహ్మద్ సిరాజ్!

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు, బాలీవుడ్ సింగర్ జనై భోస్లేతో డేటింగ్‌లో ఉన్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ముంబైలోని బాంద్రాలో జరిగిన జనై బర్త్ డే సెలబ్రేషన్స్‌లో సిరాజ్ పాల్గొన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఓ ఫోటోలో జనై, సిరాజ్ సన్నిహితంగా ఉండటంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఆ వార్తలపై సిరాజ్ తాజాగా స్పందించారు.

అసత్యాలు ప్రచారం చేయొద్దు!

‘దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దు.. జనై నాకు చెల్లెలు లాంటిది’ అని సిరాజ్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఆమె లాంటి సోదరి నాకెవరూ లేరు. ఆమె లేకుండా నేను ఎక్కడా ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లే.. ఆమె వెయ్యి మందిలో ఒకరు’ అనే పోస్ట్ చేశారు. మరోవైపు, జనై సైతం సిరాజ్‌ తనకు ప్రియమైన సోదరుడని పేర్కొంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్టు పెట్టారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button