తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Nitish Kumar: తగ్గేదే లే.. ఆసిస్ గడ్డపై అదరగొట్టిన తెలుగు కుర్రోడు!

టీమిండియా యువ ఆల్ రౌండర్, తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటుతున్నాడు. ఈ ట్రోఫీతోనే టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 21 ఏళ్ల నితీశ్‌.. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో ఏకంగా సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్‌ రెడ్డి.. అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 171 బంతుల్లో తొలి అంతర్జాతీయ సెంచరీ (105*)ని నమోదు చేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి 8వ వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించి.. జట్టును ఆదుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.

వర్షం ఎఫెక్ట్.. ముగిసిన మూడో రోజు ఆట!

అయితే, నితీశ్ సెంచరీ పూర్తయ్యాక బ్యాడ్‌ లైటింగ్‌ కారణంగా ఆట నిలిచిపోయింది. అప్పటికి భారత్ స్కోరు 358/9. క్రీజ్‌లో నితీశ్‌ (105), సిరాజ్‌ (2) ఉన్నారు. ఇంకా భారత్ 116 పరుగులు వెనకబడి ఉంది. అయితే, వర్షం రావడంతో పిచ్‌ను కవర్లతో సిబ్బంది కప్పేశారు. ఎంతకీ తగ్గకపోవడంతో ఆటను నిలిపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసింది. ఇవాళ భారత్ నాలుగు వికెట్లను కోల్పోయి 193 పరుగులు రాబట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 474 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button