తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్

దేశం గర్వించదగ్గ ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం అశ్విన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘భారత్‌ తరఫున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. ఇప్పుడు టైమ్‌ వచ్చిందనుకుంటున్నా. కెరీర్‌లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3,503 పరుగులు సాధించా. భారత క్రికెట్‌లో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. అయితే అంతకుముందు డ్రెస్సింగ్‌ రూమ్‌లో విరాట్ కోహ్లీతో అశ్విన్‌ భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అరుదైన రికార్డులు!

38 ఏళ్ల అశ్విన్ 2011లో వెస్టిండీస్‌పై తొలి టెస్ట్ ఆడారు. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వన్డే కెరీర్‌ను ప్రారంభించారు. 105 టెస్టులు ఆడిన అశ్విన్ 3,474 పరుగులు చేశారు. 536 వికెట్లు తీశారు. టెస్టుల్లో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించారు. టెస్ట్ ఫార్మాట్‌లో 37 సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఘనత అశ్విన్‌కే సొంతం. అంతేకాదు, ఒక టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన ఘనతను అశ్విన్ 8 సార్లు సాధించారు. 116 వన్డేల్లో 707 పరుగులు చేశారు. 156 వికెట్లు పడగొట్టారు. 65 టీ20ల్లో 72 వికెట్లను పడగొట్టారు. టీ-20 ఫార్మాట్‌లో 154 పరుగులు చేశారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button