తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Rishab Pant: ఢిల్లీని రిషబ్ పంత్ వదిలేయడానికి కారణం అదేనా?

టీమిండియాలోనూ, ఐపీఎల్‌లోనూ.. ఫార్మాట్ ఏదైనా సరే అతను క్రీజులో ఉన్నారంటే చాలు ఫోర్లు, సిక్సర్ల రూపంలో పరుగులకే పరుగులు పెట్టాస్తారు. అయితే అన్యూహ్యంగా ఆయనకు 2025 ఐపీఎల్ సీజన్లో గడ్డుపరిస్థితి ఎదురైంది. ఆ ప్లేయర్ ఎవరో కాదు, రిషబ్ పంత్. దాదాపు 9 ఏళ్లపాటు ఉత్తమ ఆటగాడిగా, కెప్టెన్‌గా సేవలందించిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిటైన్ చేసుకోకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీసింది.

కెప్టెన్సీ మార్పు కూడా..

తన కెరీర్‌ ప్రారంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పంత్‌ను పక్కన పెట్టేందుకు కారణాలు ఒక్కోలా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వాటిలో మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని అంటున్నారు. కొంతకాలంగా ఢిల్లీ మేనేజ్‌మెంట్‌తో పంత్‌కు విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పంత్ కూడా ఇక జట్టుతో కొనసాగవద్దని నిర్ణయించుకున్నారట. అంతేకాదు, కెప్టెన్సీ మార్పు చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. పంత్‌ను తొలగించి అక్షర్ పటేల్‌ను సారథిగా నియమించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే, పంత్‌ జట్టును వీడిపోయినట్లు క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.

యాజమాన్యమే కారణమా?

వచ్చే రెండేళ్లపాటు దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు సంబంధించిన నిర్ణయాలు సహ యజమాన్యం జీఎంఆర్ సంస్థ తీసుకుంటుంది. ఇప్పుడదే పంత్‌ వైదొలగడానికి కారణంగా మారినట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కోచింగ్ బృందంలో మార్పులు చేసిన జీఎంఆర్‌.. పంత్‌ విషయంలోనూ కీలక నిర్ణయానికొచ్చిందట. ప్రధాన కోచ్‌గా హేమంగ్‌ బదానీ, డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా వేణుగోపాల్‌రావును డీసీ నియమించింది. కెప్టెన్సీ విషయంలోనూ జీఎంఆర్‌కు పంత్‌ మొదటి ఆప్షన్‌ కాదని వార్తలు వచ్చాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button