Nuwan Thushara: శ్రీలంకకు వరుస ఎదురుదెబ్బలు.. జట్టుకు కీలక ప్లేయర్ల దూరం
సొంతగడ్డ మీద భారత్ పై సిరీస్ గెలవాలనే శ్రీలంక ఆశలు ఆవిరైపోయేలా కనిపిస్తున్నాయి. వరుస గాయాలు ఆ జట్టును వేధిస్తున్నాయి. నిన్న సీనియర్ పేసర్ దుష్మంత చమీర దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో అసిత ఫెర్నాండోకు స్థానం దక్కింది. అయితే తాజాగా మరో యువ పేసర్ నువాన్ తుషార గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెర్ బోర్డు నేడు ప్రకటించింది.
Read also: Dushmantha Chameera: భారత్ తో శ్రీలంక టీ20, వన్డే సిరీస్.. శ్రీలంక నుంచి కీలక ప్లేయర్ ఔట్
ప్రాక్టీస్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నిన్న తుషార ఎడమ బొటన వేలికి గాయమైంది. అతని స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక జట్టులోకి వచ్చాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో తుషార అదరగొట్టాడు. మూడు మ్యాచ్ ల్లో 8 వికెట్లు పడగొట్టి తన మార్క్ చూపించాడు. లంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ తో తుషార అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. శ్రీలంక క్రికెట్ టీ20 సిరీస్ కు 16 మందితో కూడిన స్క్వాడ్ ను మంగళవారం ప్రకటించింది.