TNPL: బ్యాట్‌తో అశ్విన్ విధ్వంసం… వీడియో వైరల్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్‌పిఎల్)-2024లో దిండిగల్ డ్రాగన్స్ క్వాలిఫియర్-2కు అర్హత సాధించింది. దిండిగల్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెపాక్ సూపర్ గిల్స్‌పై 4 వికెట్ల తేడాతో డ్రాగన్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు కెప్టెన్, భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించారు.
తొలుత బౌలింగ్‌లో విఫలమైన అశ్విన్.. బ్యాటింగ్‌లో మాత్రం దుమ్ములేపాడు. 159 పరుగుల లక్ష్య చేధనలో అశ్విన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కళ్లు చెదిరే షాట్లను అశ్విన్ ఆడారు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్.. ఓపెనర్ శివమ్ సింగ్‌తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 35 బంతులు ఎదుర్కొన్న అశ్విన్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. అశ్విన్‌తో పాటు శివమ్ సింగ్(64) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా 159 పరుగుల లక్ష్యాన్ని దిండిగల్ డ్రాగన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగలు చేసింది. చెపాక్ సూపర్ గిల్స్ బ్యాటర్లలో కెప్టెన్ అపరజిత్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆగస్టు 2న జరగనున్న క్వాలిఫియర్-2లో ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో దిండిగల్ డ్రాగన్స్ తలపడనుంది.