తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Virat, Jaiswal: ఆస్ట్రేలియా మీడియాలో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్‌ మేనియా.. మామూలుగా లేదుగా..!

బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీకి టీమిండియా సిద్ధమైపోయింది. నవంబర్‌ 22 నుంచి ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య ఈ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం విరాట్‌ కోహ్లీ ముందుగానే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. ఆదివారమే ఆయన పెర్త్‌ చేరుకున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో దారుణంగా విఫలమైన విరాట్.. ఆసీస్‌పై రాణించాలనే పట్టుదలతో ఉన్నారు.ఇక టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. కొంతకాలంగా ఈ యువ ఆటగాడు టెస్టుల్లో నిలకడగా ఆడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోహ్లీ, యశస్వి జైస్వాల్‌‌ను ఆస్ట్రేలియా మీడియా ప్రశంసలతో ముంచెత్తుతోంది. వీరిద్దరిని హైలైట్‌ చేస్తూ పలు పత్రికలు వార్తా కథనాలు ప్రచురించాయి.

ఆస్ట్రేలియాలో మనోళ్ల క్రేజ్!

‘ది డైలీ టెలిగ్రాఫ్‌’ వార్తా పత్రిక కోహ్లీ నిలబడి ఉన్న ఫొటోను ఫ్రంట్ కవర్‌ పేజీలో ప్రచురించింది. ఏ ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు, ఎన్ని పరుగులు, సెంచరీలు చేశాడు, సగటు ఎంత? అనే వివరాలను పొందుపర్చింది. అదే వార్తా పత్రిక గతంలో యశస్వి జైస్వాల్‌ను సెంచరీ చేసిన ఫొటోను ప్రచురించి ‘కొత్త రాజు’ అనే అర్థం వచ్చేలా హెడ్డింగ్‌ పెట్టింది. దీనికి హిందీ, పంజాబీ భాషలోనూ ఫాంట్లను జోడించింది. దీనికి సంబంధించిన చిత్రాలను భారత క్రీడాభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ ఖుషీ అవుతున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button