క్రికెట్
Yashasvi Jaiswal: అదరగొడుతున్న యశస్వి జైస్వాల్.. రికార్డులే రికార్డులు!
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్నాడు. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచులో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకే ఔటైన యశస్వి .. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 205 బంతుల్లో సెంచరీ బాదేశాడు. వికెట్ల వెనుక అప్పర్ కట్ సిక్స్‌తో సెంచరీ పూర్తి చేయడం విశేషం. అతడికిది కెరీర్‌లో నాలుగో శతకం. ఈ క్రమంలో పలు రికార్డులను యశస్వి సొంతం చేసుకున్నాడు.
రికార్డుల వీరుడు!
- మొదటి 15 టెస్టుల్లో 1500+ పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు
- ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 1500+ రన్స్ చేసిన రెండో భారత బ్యాటర్‌గా యశస్వి ఘనత. 28 ఇన్నింగ్స్‌ల్లో దీన్ని సాధించాడు.
- ఆస్ట్రేలియాలో ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు.
- ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్ ఓపెనర్‌గా యశస్వి రికార్డు సృష్టించాడు. అతడు 22 ఏళ్ల 330 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు కేఎల్ రాహుల్ (22 ఏళ్ల 263 రోజులు).
- 23 ఏళ్లు రాకముందే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన జాబితాలో యశస్వి ఐదో బ్యాటర్. ఈ ఏడాది యశస్వి 3 శతకాలు బాదాడు. అందరికంటే సునీల్ గావస్కర్ (1971లో 4 సెంచరీలు) సాధించారు.
- భారత్ తరఫున 23 ఏళ్ల వయసులోపే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో బ్యాటర్ యశస్వి (4). సచిన్ అందరికంటే ఎక్కువగా 8 సెంచరీలు చేశాడు.