తెలుగు
te తెలుగు en English
క్రీడలు

Hockey: చరిత్ర సృష్టించిన భారత్.. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత!

చైనాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి టైటిల్‌ని నిలుబెట్టుకున్న టీమిండియా.. మొత్తం ఐదుసార్లు ట్రోఫీని నెగ్గింది. భారత్‌ 1-0 తేడాతో చైనాపై పోరాడి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. డిఫెండర్‌ జుగ్‌రాజ్‌ సింగ్‌ 51వ నిమిషంలో గోల్ కొట్టి టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 5-2 తేడాతో కొరియాని ఓడించింది. కాగా పారిస్‌ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్‌ జట్టు కాంస్యంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

తొలిసారి ఫైనల్ చేరిన చైనా!

ఇక, ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో చైనా ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా అత్యుత్తమంగా ఫైనల్‌కు చేరింది. భారత్‌ గ్రూప్‌ దశలో జపాన్‌ను 5-1 తేడాతో ఓడించింది. చైనాను 3-0, మలేషియాపై 8-1, దక్షిణ కొరియాను 3-1, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఉత్కంఠ పోరులో 2-1 తేడాతో విజయం సాధించింది. సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు చరిత్రలో తొలిసారిగా వరుసగా బ్యాక్‌ టు బ్యాక్‌ ఎడిషన్స్‌లో టైటిల్స్‌ను నిలబెట్టుకున్నది. గతేడాది చెన్నైలో జరిగిన సమ్మిట్‌లో మలేషియాను 4-3తో ఓడించి సొంతగట్టపై టైటిల్‌ను నెగ్గింది. గతంలో 2021, 2016లో భారత్‌ ట్రోఫీని నెగ్గింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఏడు గోల్స్‌తో పోటీలో అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలువగా.. దక్షిణ కొరియాకు చెందిన యాంగ్ జి-హున్ అగ్రస్థానంలో నిలిచాడు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button