తెలుగు
te తెలుగు en English
క్రీడలు

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో బీజేపీ ఎమ్మెల్యే… ఎవరీ శ్రేయాసీ సింగ్ ?

పారిస్ ఒలింపిక్స్‌లో బిహార్ నుంచి ఒక్కరు మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెనే బీజేపీ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో పోటీ పడుతున్న ఆమె కామన్వెల్త్ గేమ్స్‌లో 2014లో డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో రజతం, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన శ్రేయసి సింగ్ 2020లో జముయ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

శ్రేయసి సింగ్ ప్రసిద్ధ షూటర్. జాతీయ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో ఆమెను సత్కరించారు. 2020లో బీజేపీలో చేరడంతో శ్రేయాసి సింగ్ రాజకీయ ఎంట్రీ జరిగింది. బీహార్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ ప్రకాష్‌ను 41 వేల ఓట్ల తేడాతో ఓడించారు.

ALSO READ: శ్రీలంకకు వరుస ఎదురుదెబ్బలు.. జట్టుకు కీలక ప్లేయర్ల దూరం

రాజకీయ బాధ్యతలు ఉన్నప్పటికీ, శ్రేయసి తన షూటింగ్‌పై మక్కువను కోల్పోలేదు. శ్రేయాసీ సింగ్ ఫరీదాబాద్‌లోని మానవ్‌రచనా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆమె కుటుంబం మొత్తం రాజకీయాలతో సంబంధం ఉంది. ఈ క్రమంలోనే ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. బీహార్ దివంగత మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తెనే ఈ శ్రేయసి సింగ్. ఒలింపిక్స్‌లో దేశానికి షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధిస్తానని శ్రేయసి సింగ్ ధీమా వ్యక్తం చేసింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button