Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో తొలి మెడల్..చరిత్ర సృష్టించిన మనూ భాకర్
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకాన్ని గెలిచింది. 221.7 పాయింట్ల తేడాతో బాకర్ మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఒలింపిక్స్ లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను బాకర్ రికార్డు సృష్టించింది. ఇద్దరు కొరియన్ అథ్లెట్స్ స్వర్ణం, రజతం పతకాలు సాధించారు.
మరోవైపు.. పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో అర్జున్ బబుతా అదరగొట్టేశాడు. 630.1 స్కోర్‌తో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ సందీప్ సింగ్ 629.3 స్కోర్ సాధించి 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే, పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ ఫైనల్ సోమవారం మ.3.30 గంటలకు ప్రారంభంకానున్నది.
ALSO READ: ఒలింపిక్స్‌లో బీజేపీ ఎమ్మెల్యే… ఎవరీ శ్రేయాసీ సింగ్ ?
ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మనూ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్‌లో పాల్గొనేవారు. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్‌లో 9 బంగారు పతకాలు కొల్లగొట్టారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు. అర్జున అవార్డు గ్రహీత కూడా.