తెలుగు
te తెలుగు en English
క్రీడలు

PV Sindhu: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బ్యాడ్మింటన్ స్టార్!

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ వ్యాపారవేత్త వెంకట దత్త సాయి.. సింధు మెడలో మూడు ముళ్లు వేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌‌పూర్ ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 11 గంటల 20 నిమిషాలకు వీరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకి ఇరు కుటుంబాలతో పాటు అతి కొద్దిమంది బంధుమిత్రులు, ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు.

రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్

కాగా.. పోసిడెక్స్ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన వెంకట దత్త సాయి‌తో పీవీ సింధుకి కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇక, డిసెంబర్ 24, మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు హాజరు కావాలని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలువురు రాజకీయ నాయకులతో పాటు, సినీ, క్రీడా ప్రముఖులకు పీవీ సింధు స్వయంగా వెళ్లి ఆహ్వానం అందించారు.

ఇక, పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. 2013లో అర్జున అవార్డు గెలిచిన పీవీ సింధు, 2015లో పద్మశ్రీ పురస్కారం దక్కించుకుంది. 2016లో మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్న పీవీ సింధుని, 2020లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button