తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

జనవరి 17: చరిత్రలో ఈరోజు

ద్వంద్వ పౌరసత్వం (17 జనవరి 1997)
ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం ఇచ్చేది లేదని భారత ప్రభుత్వం 1997లో ఇదే రోజున ప్రకటించింది. ద్వంద్వ పౌరసత్వం అరాచక శక్తులకు అస్త్రంగా మారుతుందని.. ఉగ్రవాదులకు ఊతమిస్తుందనే అభిప్రాయంతో నాడు ద్వంద్వ పౌరసత్వానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read జనవరి 16 చరిత్రలో ఈరోజు

అనిల్ కుంబ్లే నయా రికార్డు (17 జనవరి 2008)
భారత క్రికెట్ ఆటగాడు అనిల్ కుంబ్లే పేరిట భారత క్రికెట్ చరిత్రలో చెరిగిపోని రికార్డులు ఉన్నాయి. 2008లో ఇదే రోజు కుంబ్లే వికెట్లతో ఆట ఆడేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో 600 వికెట్లు పడగొట్టిన భారతీయ బౌలర్ గా అనిల్ కుంబ్లే రికార్డు నెలకొల్పినది ఈరోజే. ఈ రికార్డును ఆస్ట్రేలియా జట్టుపై నమోదు చేశాడు. కాగా కుంబ్లే కెరీర్ లో మొత్తం 132 టెస్టుు ఆడిన కుంబ్లే మొత్తం 619 వికెట్లు పడగొట్టారు.

ఎంజీఆర్ జయంతి (17 జనవరి 1917)
తమిళ సుప్రసిద్ధ నటుడు, రాజకీయ నాయకుడు ఎంజి రామచంద్రన్ జయంతి నేడు. 17 జనవరి 1917లో పుట్టిన ఎంజీఆర్ పూర్తి పేరు మారుతుర్ గోపాలన్ రామచంద్రన్. రంగ స్థల నటుడి నుంచి తమిళ సినిమా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన ఎంజీఆర్ రాజకీయాల్లోనూ అత్యున్నత పదవులు పొందారు. మొదట కాంగ్రెస్ తో రాజకీయ జీవితం మొదలై డీఎంకేలో కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం జరిగిన పరిణామాలతో సొంతంగా ఏఐఏడీఎంకేని స్థాపించి అధికారంలోకి వచ్చారు. 1977లో సీఎం బాధ్యతలు చేపట్టి తన చివరి శ్వాస వరకు అంటే 24 డిసెంబర్ 1987 ప్రజాసేవలోనే కొనసాగారు.

Also Read జనవరి 15 చరిత్రలో ఈరోజు

ఎల్వీ ప్రసాద్ జయంతి (17 జనవరి 1908)
తెలుగు చిత్రసీమ మూలపురుషుల్లో అక్కినేని లక్ష్మీ వరప్రసాద రావు ఒకరు. నిర్మాత, దర్శకుడు, నటుడిగా తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని ముద్రవేసిన ఎల్వీ ప్రసాద్ జయంతి నేడు. 17 జనవరి 1908లో జన్మించిన ఆయన 22 జూన్ 1994లో కన్నుమూశారు. పాతకాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తదితరులతో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. ప్రసాద్ స్టూడియో సినిమాలకు పుట్టిల్లుగా మారిపోయింది.

మరికొన్ని విశేషాలు

  • స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1941లో జర్మనీ నుంచి తన మకాం మార్చాడు.
  • భారత దిగ్గజ బాక్సర్ మహమ్మద్ అలీ కమర్ జన్మదినం నేడు (1942).
  • పశ్చిమ బెంగాల్ ను 3 దశాబ్దాల పాటు ఏలిన కమ్యూనిస్టు కురువృద్ధుడు జ్యోతిబసు వర్ధంతి నేడు(2010). 1977 నుంచి 2000 వరకు ఆయన సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు.
  • ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ జన్మదినం ఈరోజు (1945)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button