తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanu Man: 100 కోట్ల క్లబ్ లోకి ‘హను మాన్’…

ప్రశాంత్ వర్మ – తేజ సజ్జా కాంబినేషన్లో రూపొందిన ‘హను మాన్’ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను రిలీజ్ చేశారు. నిన్నటితో ఈ సినిమా విడుదలై 4 రోజులైంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
లాంగ్ రన్ లో ఈ సినిమా వసూళ్లు ఎంతవరకూ వెళతాయనేది చూడాలి.

Also Read: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… చిరంజీవి 156వ సినిమా టైటిల్ ఇదే!

ఈ సినిమా నుంచి టీజర్ .. ట్రైలర్ ఎప్పుడైతే బయటికి వచ్చాయో, అప్పటి నుంచి అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. అందువలన పెద్ద సినిమాలతో పోటీపడుతూ ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. కథ నేపథ్యంలో హనుమంతుడిని చూపిస్తూ, పిల్లల నుంచి పెద్దలవరకూ వినోదాన్ని పంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

Also Read: హృతిక్ ‘ఫైటర్’ మూవీ… మైండ్ బ్లోయింగ్‌గా ట్రైలర్

చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం సెన్సేషన్ అని చెప్పాలి. ఈ చిత్రం లో అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button