తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Family Star: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.. రేపే రిలీజ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్‌’. ఈ మూవీకి పరశురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా నుంచి టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా, ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ALSO READ: ‘రామాయణం’ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు!

ఈ మూవీకి సెన్సార్ బోర్డు స‌భ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అదే విధంగా ఈ మూవీ 2:30 నిమిషాలు మేకర్స్ వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ‘ఫ్యామిలీ స్టార్’ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ విజయ్ మృణాల్ ఠాకూర్ లపై ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో మేక‌ర్స్ రాసుకొచ్చారు. మ‌రోవైపు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినట్లు ప్ర‌క‌టించింది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలో రష్మిక మందన్న అతిథి పాత్రలో నటించగా, దివ్యాంశ కౌశిక్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button