తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Chiranjeevi: ఆయనకు తప్ప అర్హత ఎవరికీ లేదు.. దటీజ్ మెగాస్టార్

మహానటి సావిత్రి సినీ జీవితంపై ప్ర‌ముఖ ర‌చ‌యిత సంజయ్ కిశోర్ రచించిన పుస్త‌కం ‘సావిత్రి క్లాసిక్స్‌’. ఈ బుక్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జ‌రిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు నిర్మాత అల్లు అరవింద్, సావిత్రి కుమారుడు సతీశ్ కుమార్, మురళీ మోహన్, జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడారు. ఈ పుస్తకాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా లాంఛ్ చేయడానికి కారణమేంటో కూడా ఆమె వివరించారు.

ALSO READ: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైల‌ర్ రిలీజ్

‘నేను ఒకసారి చిరంజీవి గారి ఇంటికెళ్లినప్పుడు కర్ర సాయంతో మెట్లపై నుంచి వచ్చారు. ఏమైందని అడిగిన తర్వాత నన్ను ఆప్యాయంగా పలకరించి, కాఫీ తెప్పించారు. ఆ తర్వాత ఉదయం లేవగానే అమ్మ ముఖం కనపడాలమ్మా.. నేను లేవగానే బెడ్‌రూమ్‌లో ముందుగా అమ్మ ఫొటోనే చూస్తానని చిరంజీవి చెప్పారు. అయితే నేను నమ్ముతానో లేదోనని పైకి వెళ్లి ఆ ఫొటో తీసుకొచ్చి మరీ నాకు చూపించారు. చాలా మంది మనసులో ఒకటి అనుకొని, మాటల్లో ఇంకొకటి చెప్పి, చేసేటప్పుడు వేరేది చేస్తుంటారు. కానీ చిరంజీవి గారికి ఆ మూడు ఒక్కటే. అందుకే ఈ బుక్‌ రిలీజ్ చేసేందుకు ఆయనకు తప్ప ఎవరికీ అర్హత లేదని, పట్టుపట్టి అడిగాను’ అని చాముండేశ్వరి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button