తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL-2024: అదరగొట్టిన మ‌యాంక్ .. కెమ‌రూన్ గ్రీన్ క్లీన్ బౌల్డ్‌.. వీడియో వైరల్

ల‌క్నో సూప‌ర్ గెయింట్స్ యువ బౌల‌ర్ మ‌యాంక్ యాద‌వ్‌ అదరగొట్టాడు. మంగళవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ యాదవ్‌ (3/14) విజృంభించడంతో 28 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో త‌న స్పీడ్‌తో థ్రిల్ చేశాడు. అయితే బెంగుళూరు బ్యాట‌ర్ కెమ‌రూన్ గ్రీన్‌ను మ‌యాంక్ బౌల్డ్ చేసిన స్ట‌యిల్ స్ట‌న్నింగ్‌గా ఉంది. మ‌యాంక్ వేసిన ఈ బంతి 156.7 కిలోమీట‌ర్ల వేగంతో వేశాడు. ఆఫ్ స్టంప్‌పై వేసిన ఈ బంతి.. గ్రీన్ డిఫెన్స్‌ను చేధించుకుంటూ నేరుగా వెళ్లి వికెట్ల‌ను ఢీకొట్టింది.

ALSO READ: ఆర్సీబీకి మరో ఓటమి..హడలెత్తించిన లక్నో పేస్‌ బౌలర్‌

మ‌యాంక్ వేసిన మంతి 156.7 కిలోమీట‌ర్ల వేగం రావడంతో కామెంట‌రీ ఇస్తున్న ర‌వి శాస్త్రి సైతం ఆశ్చర్యపోయాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ డెలివ‌రీ కావ‌డం విశేషం. టోర్నీ హిస్ట‌రీలో మాత్రం ఇది నాలుగ‌వ ఫాస్టెస్ట్ బంతి కావ‌డం గమ‌నార్హం. అంతకుముందు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనూ మయాంక్ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 155.8 కి.మీ వేగంతో బాల్ విసిరాడు. ఇలా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అతను మూడు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులతో మ్యాక్స్‌వెల్‌తో పాటు కామెరూన్‌ గ్రీన్‌, రజత్‌ పటీదార్‌ల వికెట్లు పడగొట్టాడు.

5 Comments

  1. Wow, incredible blog format! How long have you ever been running a blog for?

    you make blogging look easy. The entire glance of your web
    site is magnificent, as smartly as the content! You can see similar
    here ecommerce

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button