తెలుగు
te తెలుగు en English
క్రికెట్

TSRTC: ఉప్పల్ వేదికగా హైదరాబాద్- చెన్నై మ్యాచ్.. మ్యాచ్ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు

ఐపీఎల్ -2024 లో భాగంగా శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య ఉప్పల్ స్డేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. సొంత గడ్డపై ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టిన సన్ రైజర్స్ చెన్నైతో జరిగే మ్యాచ్ లో కూడా ఆదే జోరు కనబరచాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంట‌లకు ప్రారంభ‌మై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బ‌య‌లుదేరుతాయని వెల్లడించారు. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాల‌ని క్రికెట్ అభిమానుల‌కు సూచించారు.

Also read: Suryakumar Yadav: ముంబై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జట్టులోకి సూర్యకుమార్ వచ్చేస్తున్నాడు

ఐపీఎల్ 17వ సీజన్ లో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌ మార్చి 27న ముంబైతో జరగగా.. ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 25న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్, మే 8న లక్నో సూపర్ జెయింట్స్, మే 16న గుజరాత్ టైటాన్స్, మే 19న పంజాబ్ కింగ్స్ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మ్యాచ్‌లు హైదరాబాద్‌లో లేవు.

6 Comments

  1. Hi, i read your blog from time to time and i own a similar one and
    i was just curious if you get a lot of spam comments? If so how do you
    reduce it, any plugin or anything you can recommend?
    I get so much lately it’s driving me insane so any assistance
    is very much appreciated.

    Have a look at my blog vpn coupon code 2024

  2. Wow, wonderful blog structure! How lengthy have you ever been blogging
    for? you made running a blog glance easy. The entire look of your site is
    wonderful, as neatly as the content material! You can see
    similar here dobry sklep

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button