తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

CM YS Jagan: జనంలోకి చొచ్చుకుపోయేలా.. వైసీపీ చేపట్టనున్న కొత్త కార్యక్రమం ఇదే!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఇంకా పోలింగ్‌ తేదీకి 11 రోజులే ఉండడంతో ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తుంది. ఆ పార్టీ అధినేత ఆదేశాలనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ ఇప్పటికే ‘సిద్ధం’ సభలు, ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సు యాత్రలతో సక్సెస్ అయ్యారు. తాజాగా, మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనంలోకి చొచ్చుకుపోయేలా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే బాబుకు తెలుసా? సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ప్రతీ ఇంటికి వైసీపీ మేనిఫెస్టో..

వైసీపీ చేపట్టిన కొత్త కార్యక్రమమే ‘జగన్‌ కోసం సిద్ధం’. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వైసీపీ మేనిఫెస్టో-2024ను చేరవేయనున్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, లేదంటే వైసీపీ చేపట్టిన పథకాలు నిలిచిపోతాయని తెలియజేయనున్నారు. అదే విధంగా పేదల జీవితాల్లో మార్పు రావాలంటే జగన్ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచనను తెలియజేయనున్నారు. ఈ మేరకు ఇవాళ పార్టీ కీలక నేతలు ‘జగన్‌ కోసం సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ALSO READ: కూటమిలో లుకలుకలు.. ఉమ్మడి మేనిఫెస్టో వేదికపై కనిపించని మోదీ ఫోటో!

సామాన్యులను భాగస్వామ్యం చేసేలా …

సీఎం జగన్ మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్‌ క్యాంపెయినర్లంటూ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ‘జగన్‌ కోసం సిద్ధం’ కార్యక్రమంలో ఆ సామాన్యులను భాగం చేసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను దాదాపుగా పూర్తి స్థాయిలో అమలు చేసింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అంతేకాదు.. మేనిఫెస్టోను ఓ ప్రొగ్రెస్‌ రిపోర్టులాగా.. 58 నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నామంటూ పేర్కొన్న విషయాన్ని మరోసారి వివరించనున్నారు. ఈ హామీలనే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చురగొనాలని వైసీపీ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button