తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

TDP: టీడీపీని ఆవరించిన ఓటమి భయం.. చేతులెత్తేసిన అభ్యర్థులు!

పోలింగ్‌కు ఇంకా మూడు రోజులే సమయం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఏకంగా రోజుకు మూడు సభలతో ముందుకెళ్తున్నారు. ప్రజలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతూ పక్కా ప్రణాళికతో ‘వై నాట్ 175, 25’ నినాదంతో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వైసీపీ పోల్ మేనేజ్‌మెంట్ పటిష్ట కార్యాచరణను సైతం రూపొందించింది. ఆర్థిక వనరులు సైతం వైసీపీకి పుష్కలంగా ఉన్నాయి. ఇక టీడీపీ, కూటమి నేతల్లో మాత్రం అసంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పోల్ మేనేజ్‌మెంట్ పటిష్టంగా లేకపోవడం, ఆర్థిక వనరుల లేమితో ఎమ్మెల్యే అభ్యర్థులు ఏం చేయాలో తెలియక చేతులెత్తేస్తున్నారు.

ALSO READ: పవన్ కళ్యాణ్‌ని ఓడించకపోతే రాష్ట్రానికే ప్రమాదం: రాజేశ్ మహాసేన

ఆర్థిక వనరుల లేమితో కటకట!

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వెలువడిన ఏ సర్వే చూసినా వైసీపీనే మరోసారి అధికారం చేజిక్కించుకుంటుందని స్పష్టమైంది. దీంతో కూటమి నేతలు సహజంగానే గెలుపుపై విశ్వాసం కోల్పోయారు. దీనికి తోడు ఆర్థిక వనరుల లేమితో అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంపీ అభ్యర్థులుగా టిక్కెట్లు పొందిన వారు తమ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్థిక వనరులను సమకూరుస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఒక్క రూపాయి అందలేదు. దీంతో సరైన సమయంలో ఆర్థిక సాయం అందక ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇక చేసేదేం లేక, ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికలను వదులుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. కొంతమందైతే ప్రచారానికి కూడా వెళ్లడం లేదట.

ALSO READ: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్‌

వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న జగన్!

ఇక, వైసీపీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. 2024 ఎన్నికల కోసం సీఎం జగన్ చాలాకాలంగా కసరత్తు చేస్తున్నారు. వై నాట్ 175 అంటూ పార్టీని అప్రమత్తం చేశారు. తమ ప్రభుత్వం అందించిన సంక్షేమం, సామాజిక న్యాయంతో అన్ని సీట్లలో విజయం సాధించాల్సిందేనని దిశా నిర్దేశం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం, స్థానిక ప్రజా స్పందనపైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా..సమన్వయం లేకపోయినా పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. పొరపాట్లను సరి చేసుకొని ముందుకు వెళ్లాలని నిర్దేశిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ముఖ్యమని సీరియస్‌గా చెబుతున్నారు. కూటమి ముఖ్య నేతల నియోజక వర్గాల్లోనూ గెలిచి తీరాల్సిందేనని పార్టీ బాధ్యులకు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button