తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

#YSR Kapu Nestham: ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. ఈ నెల 14న అకౌంట్‌లోకి డబ్బులు..!

ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిమిషం నుంచి, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏపీలో మాత్ర‌మే సంక్షేమ పథ‌కాలు అమలు అవుతున్నాయి. ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం కింద నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. అయితే ఇప్పుడు తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. జగన్ సర్కారు మరో గుడ్‌న్యూస్ చెప్పింది.

సెప్టెంబ‌ర్ 14 న తూర్పు గోదావరి జిల్లాలో కాపు నేస్తం నిధులు విడుదల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగే భారీ బహిరంగ సభలో, జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో, 15 వేల రూపాయ‌లు డబ్బులను జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఏటా 3.5 ల‌క్ష‌ల మంది బీసీ మ‌హిళ‌లు ల‌బ్ధి పొందుతున్నారు. ఐదేళ్లలో 75 వేల రూపాయిల‌ ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఈ క్ర‌మంలో ముఖ్యమంత్రి రూట్‌ మ్యాప్, సెయింట్ ఆం బ్రోస్‌ హైస్కూల్‌లో పబ్లిక్ మీటింగ్, నెహ్రూబొమ్మ సెంటరు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో హెలిప్యాడ్‌కు స్థలాలను, ముంద‌స్తు భ‌ద్ర‌త ఏర్పాట్ల‌ను అక్క‌డి అధికారులు ప‌రిశీలిస్తున్నారు.

ఇక‌పోతే ఏపీలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళకు కాపు నేస్తం అందిస్తోంది జ‌గ‌న్ స‌ర్కార్. ఈ క్ర‌మంలో 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలను అర్హులుగా ప్రకటించింది.

కాపు నేస్తంకు ఎవరు అర్హులు..?

  • కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల‌ లోపు ఉన్నవారు మాత్ర‌మే ఈ పథకానికి అర్హులు.
  • అదే పట్టణ ప్రాంతాల్లో అయితే నెలసరి ఆదాయం 12 వేల లోపు ఉంటేనే కాపు నేస్తానికి అర్హులు.
  • కుటుంబానికి గరిష్టంగా 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి ఉంటేనే కాపు నేస్తంకు అర్హులు. మెట్ట, మాగాణి రెండూ కలిపి 10 ఎకరాలకు మించకూడదు.
  • అలాగే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు మాత్రమే అర్హులు.
  • ఏ కుటుంబంలో అయినా, కారు లాంటి నాలుగు చక్రాల వాహనాలు ఉంటే కాపు నేస్తానికి అనర్హులు.
    జీవనోపాధిలో భాగంగా.. ఆటో, టాటా ఏస్‌, ట్రాక్టర్‌ వంటి వాహనాలు ఉన్నవాళ్లు మాత్రం, ఈ ప‌థ‌కానికి అర్హులు.
  • అలానే కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పుటికీ ఈ పథకానికి అర్హులు.
  • ఇక కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కాపు నేస్థం పథకానికి అనర్హులు.
  • అలానే ప్రభుత్వ పెన్టన్‌ పాందుతున్నవారు సైతం కాపు నేస్తానికి అనర్హులు.
  • కుటుంబంలో ఎవరైనా ఆదాయపన్ను చెల్లిస్తుంటే, వారు ఈ పథకానికి అనర్హులు.

కాపు నేస్తానికి ఏ డాక్యుమెంట్లు కావాలి..?

ఆధార్‌ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వయసు నిర్దారణ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలి. కాపు నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాలో పడగానే లబ్ధిదారుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. ఒక‌వేళ ఈ ప‌థ‌కం కింద‌ అర్హత ఉండి జాబితాలో పేరు లేకుంటే, నేరుగా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తర్వాత, అర్హులైన వారికి కూడా కచ్చితంగా ఆర్థిక సాయం అందుతుంది. ఇక అర్హతలు ఉండి జాబితాలో పేరు ఉన్నప్పటికి కూడా అకౌంట్‌లో డబ్బులు పడకపోతే దగ్గరలోని సచివాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే అర్హుల జాబితాను ఆయా సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.

#YsrKapuNestam #AP #YsJagan

171 Comments

    1. Mi like mariu follow nu adopt cheyanivandi, Thanks.

  1. ఈ పథకం ద్వారా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే కాకుండా మరిన్ని ఎన్నో సంక్షేమ పథకాల అందిస్తున్నారు…

  2. పేదల పాలిట దేవుడు జగన్న, మళ్ళీ జగన్ గారే సీఎం కావాలి, జై జగన్

  3. ఇలాంటి పథకాల ద్వారా అన్ని కులాల మహిళలను ఆర్థికం చేయూత ను ఇచ్చాడు జగన్ అన్న.

  4. CM Y S Jagan has given required importance to the people of kapu community starting from his tenure both in politics and in issuing welfare schemes,People of Kapu community should support him landslidely in the upcoming elections by keeping the Jagan in mind regarding the goodness which the CM has showering on them continously.

  5. ఈ పథకం ద్వారా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇ పధకం కాకుండా మరిన్ని ఎన్నో సంక్షేమ పథకాల అందిస్తున్నారు…

  6. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం 100% కరెక్ట్

  7. జగన్ అన్న … నువ్వు ఎపుడు చలగ ఉండాలి
    అలాగే నీరు పెద్ద కుటుంబాలు కూడా ఇలానే కలకలలు ఆడాలి….👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button