తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YCP: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోకు సర్వజనామోదం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు సిసలు ఎన్నికల రణరంగం ఇప్పుడే మొదలైందని చెప్పాలి. నిన్న వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతోంది. నిజానికి వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. జగన్‌ని రాజ‌కీయంగా విభేదించే వారు సైతం మేనిఫెస్టో విష‌యంలో ఆయ‌న బాధ్య‌తయుతంగా వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌శంసిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, మేధావులు ఈ మేనిఫెస్టోపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులో ఆచరణకు సాధ్యం కాని ఒక్క విషయం జోలికి కూడా జగన్ వెళ్లకపోవడమే ఇందుకు కారణం.

ALSO READ: గత పథకాలకు మళ్లీ చోటు.. మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్!

ప్రజల్ని సోమరిపోతుల్ని చేసే ఉచితాలకు జగన్ దూరం!

సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుడైనా మరోసారి అధికారంలోకి రావాలనే దాహంతో, ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆచరణకు సాధ్యం కాని ఏవేవో హామీలను గుప్పిస్తుంటారు. కానీ జగన్ మాత్రం అలా చేయలేదు. ఓ వైపు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా మేనిఫెస్టోను రూపొందించడంతో పాటు, ప్రజల్ని సోమరిపోతుల్ని చేసే ఉచితాల వైపు వెళ్లలేదు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఎంతో లబ్ధి చేకూర్చిన పెన్షన్లు, అమ్మఒడి, నాడు-నేడు, వైఎస్సాఆర్ సున్నా వడ్డీ, రైతు భరోసా వంటి పథకాలకు కొనసాగిస్తూనే, ఆయా పథకాలకు అందిస్తున్న నగదు ప్రోత్సాహాన్ని పెంచారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని కొనసాగించడంతో పాటు.. నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20 వేలకు పెంచుతామని చెప్పారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కొనసాగిస్తామన్నారు.

ALSO READ: ప్రచార హోరు.. సీఎం జగన్ జోరు..

ప్రజా సంక్షేమమే పరమావధిగా మేనిఫెస్టో

నిజానికి ఈ పథకాల్లో ఏ ఒక్కటి కూడా వృథా కానే కాదు. రాష్ట్రంలో అమ్మఒడి పథకం అమల్లోకి వచ్చాక ఎంతోమంది నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగులు నిండాయి. నాణ్యమైన విద్య కోసం తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో చదివించలేని తల్లిదండ్రులు ఈ పథకం ద్వారా తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందడంతో ఎంతో సంతృప్తిగా ఉన్నారు. రైతు భరోసా పథకంతో రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. పెట్టుబడి సాయం కోసం ఏ రైతు కూడా అప్పులు చేయడం లేదు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ వంటి పథకాలతో నిరుపేద తల్లిదండ్రులు తమ కుమార్తెలకు వైభవంగా వివాహాలు జరిపించుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే జగన్ ప్రవేశపెట్టిన ఏ పథకమైనా ప్రజల జీవితాలనే మార్చివేసేదే. అందుకే మళ్లీ అవే పథకాలను సీఎం జగన్ కొనసాగిస్తూ, ఈ సారి ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా మేనిఫెస్టోను రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button