తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ఓం భీమ్ బుష్

Pakka Telugu Rating : 3/5
Cast : శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, శ్రీ‌కాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు
Director : శ్రీహర్ష కోనుగంటి
Music Director : సన్నీ ఎమ్‌ఆర్‌
Release Date : 22/03/2024

శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’. ఈ సినిమాలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’తో న‌వ్వించిన శ్రీవిష్ణు మ‌రోసారి కామెడీనే ఎంచుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా నేడుథియోటర్‌లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ ఫిమేల్ లీడ్స్‌లో నటించగా.. ప్రియా వడ్లమాని ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించిందో తెలుసుకుందాం!

కథ:

గవర్నమెంట్ ఇచ్చే స్టైపెండ్, హాస్టల్ కోసం లెగసీ యూనివ‌ర్సిటీలో ముగ్గురు స్నేహితులైన క్రిష్(శ్రీవిష్ణు), వినయ్(ప్రియదర్శి), మాధవ్(రాహుల్ రామకృష్ణ)లు పీహెచ్‌డీ చేస్తుంటారు. వీళ్లు చేసే పనులు భరించలేక ఆ యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌ రంజిత్ విలుకొండ(శ్రీకాంత్‌ అయ్యంగార్‌) పీహెచ్‌డీ పెండింగ్ వర్క్ తనే కంప్లీట్ చేసి త్వరగా కాలేజీ నుంచి పంపించేస్తాడు. అలా వీళ్లు మార్గమధ్యలో భైరవపురం అనే గ్రామంలోకి వెళ్తారు. అక్కడ కొంతమంది అఘోరాలు లంకెబిందెలు వెతకడం, దయ్యాలు వదిలించడం లాంటి పనులు చేసి డబ్బులు సంపాదిస్తుంటారు. ఇది చూసిన ఆ ముగ్గురు ఇక్కడే సెటిల్ అయిపోవాలని ఆలోచించి బ్యాంగ్ బ్రోస్ అనే పేరుతో ఎ టు జెడ్ స‌ర్వీసెస్ పేరుతో ఆఫీస్ తెరుస్తారు. తర్వాత ఆ ఊర్లో సమస్యలు ఎలా పరిష్కరించారు? నిధి దొరికిందా? సంపంగి మహల్‌కు ఎందుకు వెళ్తారు? అక్కడ ఎదుర్కొన్న సమస్యలను ఎలా పరిష్కరించారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం, విశ్లేషణ:

‘ఓం భీమ్ బుష్’ సినిమాకు ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అనేది ట్యాగ్ లైన్. దీని ఆధారంగానే లాజిక్‌తో సంబంధం లేకుండా మ్యాజిక్‌ను మాత్రమే న‌మ్ముకుని దర్శకుడు తెర‌కెక్కించాడు. ‘జాతిర‌త్నాలు’ త‌ర‌హాలో ముగ్గురు స్నేహితుల మధ్య కామెడీకి హార్రర్ జోడించి ఎక్స్‌పరిమెంట్స్ చేశాడు. లాజిక్స్ ఆలోచించకుండా సినిమాల్లో వస్తున్న పాత్ర‌ల‌తో బ్యాంగ్ బ్ర‌ద‌ర్స్ చేసే పనులు కామెడీని తెప్పిస్తాయి. ఇందులో మొదటగా సంతాన లేమితో బాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తికి అంగ‌స్తంభ‌నల కోసం వైద్యం చేయ‌డం, స‌ర్పంచ్ ఇంట్లో దూరి చేసే హంగామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని చోట్ల డబల్ మీనింగ్ వచ్చే పదాలతోనే కామెడీ చేయడంలో డైరెక్టర్ అక్కడక్కడ విఫలమయ్యారు. శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి మధ్య టైమింగ్ వ‌ల్ల వ‌న్ లైన‌ర్స్ బాగా పేలాయి. అయితే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఆసక్తిగా ఉంటుందని అనుకుంటుండగా.. సెకండాఫ్‌లో దెయ్యంతో డేటింగ్ వంటి స‌న్నివేశాలు అంత‌గా ప్ర‌భావం చూపించ‌లేదు. కొన్ని స‌న్నివేశాలు సాదాసీదాగా సాగడంతో బలవంతంగా నవ్వాల్సి వస్తోంది. దెయ్యం కథ, క్లైమాక్స్ ప్రేక్షకులని నచ్చుతుంది. అయితే డేటింగ్‌లో దెయ్యం కథ తెలిసిన తర్వాత సినిమాపై ఆసక్తి పోతుంది. కానీ చివరిలో భిన్నంగా డైరెక్టర్ తన మెదడుకు పని చెప్పి ప్రేక్షకులను మెప్పించాడు.

నటీనటులు:

శ్రీ విష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ముగ్గురు కామెడీ ఆకట్టుకుంది. శ్రీవిష్ణు మరోసారి తన నటన, డైలాగ్స్‌ కొత్తగా అనిపిస్తుంది. రాహుల్‌ రామకృష్ణ తనదైన పంచ్‌ డైలాగ్స్‌, కామెడీతో ఆకట్టుకోగా, ప్రియ‌ద‌ర్శి భయస్తుడిగా మెప్పించాడు. హీరోయిన్స్‌గా ప్రీతిముకుంద‌న్‌, ఆయేషాఖాన్‌లు పరిధి మేరకు నటించారు. స్పెషల్ సాంగ్‌లో ప్రియా వడ్లమాని కనిపించగా.. ర‌చ్చ ర‌వి, ఆదిత్య మేన‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర‌లకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ వందశాతం న్యాయం చేసింది. రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ పాయింట్. వీఎఫ్ఎక్స్ కూడా బాగుంది. సన్నీ మ్యూజిక్​ హైలెవల్. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్​గా ఉన్నాయి. బీజీ చాలా చోట్ల డైలాగ్స్ వినపడకుండా డామినేట్ చేసింది. మొత్తానికి సాంకేతికపరంగా సినిమా ఉన్నతంగా ఉంది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌ విజయ్‌ వర్దన్‌ పనితీరు బాగుంది. డైరెక్టర్ హర్ష రొటీన్ దెయ్యం కథ తీసుకున్నా.. చివర్లో ట్విస్ట్‌తో లాజిక్ లేకుండా మ్యాజిక్ చేశాడు.

ప్లస్ పాయింట్స్:

శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ న‌ట‌న

కామెడీ

సంగీతం

మ్యాజిక్ సీన్స్

మైనస్ పాయింట్స్:

సాగదీత కథ

లవ్ ట్రాక్

పంచ్ లైన్: లాజిక్ నిల్.. కామెడీ ఫుల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button