తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం
Trending

ఏప్రిల్ 27: చరిత్రలో ఈరోజు

దక్షిణాఫ్రికా స్వేచ్ఛా దినోత్సవం

ఆఫ్రికా ఖండంలో దక్షిణ కొనకు ఉండే దేశం దక్షిణాఫ్రికాకు 1994లో స్వేచ్ఛా దినోత్సవంగా పాటిస్తారు. అధికారికంగా ఈ దేశాన్ని ‘రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా’ అని పిలువబడుతుంది. దేశానికి 2798 కి.మీ పొడవైన అట్లాంటిక్, హిందూ మహా సముద్ర తీరాలు హసిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర సరిహద్దులో సమీబియా, బోస్ట్వానా, జింబాబ్వే ఉన్నాయి. తూర్పు సరిహద్దులో మొజాంబిక్, స్వాజిలాండ్ ఉన్నాయి. లెసోతో అనే స్వతంత్ర ప్రాంతాన్ని దక్షిణాఫ్రికా భూభాగం చుట్టి ఉంది. దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ ఆఫ్రికాలో అన్నిటికంటే పెద్దది. 57 మిలియన్ల జనాభాతో ప్రపంచంలో 24వ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాలో 9 అధికారిక భాషలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రకటన

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్). 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పటి ఉమ్మడి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజనామా చేశారు. వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో టీఆర్ఎస్ పురుడు పోసుకుంది. అప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగాయి. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక 2022 అక్టోబర్ 5న టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు.

హెర్బర్ట్ స్పెన్సర్ పుట్టినరోజు

తత్వవేత్త, మనస్తత్వవేత్త, జీవశాస్త్రవేత్త, సామాజిక శాస్త్రజ్ఞుడు హెర్బర్ట్ స్పెన్సర్ 1820 ఇంగ్లాండ్ డెర్బీషైర్ లోని డెర్బీలో జన్మించారు.

శామ్యూల్ ఎఫ్. బీ. మోర్స్ పుట్టినరోజు

అమెరికన్ చిత్రకారుడు, ఆవిష్కర్త, ప్రకృతి చిత్రకారుడిగా తన ఖ్యాతిని స్థాపించిన శామ్యూల్ ఫిన్లీ బ్రీస్ మోర్స్ 1791 మసాచుసెట్స్ లోని చార్లెస్ టౌన్ లో జన్మించారు. మోర్స్ యూరోపియన్ టెలిగ్రాఫ్ ల ఆధారంగా సింగిల్- వైర్ టెలిగ్రాఫ్ వ్యవస్థను కనిపెట్టారు. మోర్స్ కోడ్ ను అభివృద్ధి పరిచారు. టెలిగ్రాఫ్ వాణిజ్య వినియోగాన్ని అభివృద్థి చేసేందుకు తోడ్పడ్డారు.

శ్రీరంజని (జూనియర్) మరణం

తెలుగు సినిమా నటి శ్రీరంజని 1974లో కన్నుమూశారు. ఈమె అసలు పేరు మహాలక్ష్మి. ఈమె గుంటూరు జిల్లా మురికిపూడి గ్రామంలో 1927 ఫిబ్రవరి 22న జన్మించారు. సీనియర్ శ్రీరంజనిగా పేరుపొందిన తెలుగు నటి ఈమెకు సోదరి. చిత్రపు నారాయణమూర్తి ప్రోత్సాహంతో మొదటిసారిగా భీష్మ (1944) చిత్రంలో నటించారు. 1949లో కే.వి. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన గుణసుందరి కథలో కథానాయిక పాత్రలో నటించారు.

విను చక్రవర్తి మరణం

తమిళ సినిమా నటుడు, సినీ రచయిత, దర్శకుడు విను చక్రవర్తి 2017 చెన్నైలో మరణించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలలో 1000కి పైగా చిత్రాలలో నటించారు. ఆయన ఎక్కువగా హాస్యనటుడిగా, సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా నటించారు. తమిళంలో నటించిన ముని చిత్రం ఆయనకు 1000 చిత్రం. 1977లో చక్రవర్తికి కన్నడ చిత్రం పరసంగడ గెండెటిమ్మా చిత్రంతో నటుడిగా అవకాశం దక్కింది. ప్రముఖ నటి సిల్క్ స్మితను వెండితెరకు పరిచయం చేసింది వీరే.

వినోద్ ఖన్నా మరణం

ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా 2017 మంబైలో మరణించారు. ఈయన 1946 అక్టోబర్ 6న ప్రస్తుత పాకిస్తాన్ లోని పశ్చిమోత్తర ప్రావిన్స్ పెషావర్ లో జన్మించారు. 1968 నుండి 2013 మధ్య దాదాపు 141 సినిమాల్లో నటించారు. 2007లో విడుదలైన పాకిస్థానీ చిత్రం గాడ్ ఫాదర్ లో ప్రధాన పాత్ర పోషించారు. 1968లో సునీల్ దత్ హీరోగా నటించిన మన్ కా మీట్ సినిమాలో తొలిసారిగా నటించారు. ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించారు. 1997 లో బీజేపీలో చేరి పంజాబ్ రాష్ట్రంలోని గుర్దాస్ పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999లో అదే నియోజకవర్గం నుంచి మళ్లీ గెలిచారు. 2002లో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2014లో ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2009లో ఓడిపోయారు.

మరిన్ని విశేషాలు

నాలుగో ఒలంపిక్ క్రీడలు 1908 లండన్ లో ప్రారంభమయ్యాయి.

స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రముఖ నాయకుడు తమనంపల్లి అమృతరావు 1989లో మరణించారు.

ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ 2009 బెంగళూరులో మరణించారు. తన కెరీర్ లో 60 పైగా చిత్రాలలో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button