తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

CBN: ఏపీకి రాజధానిని లేకుండా చేసిన ‘పాపం’ చంద్రబాబుది కాదా?

రాజమండ్రిలోని వేమగిరిలో ప్రధాని నరేంద్ర మోదీ నిన్న చేసిన ప్రసంగాన్ని గమనిస్తే.. అది టీడీపీకే బూమరాంగ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని అనాథను చేశారని వల్లించేవారికి కూడా మోదీ ప్రసంగమే కనువిప్పు. నిన్నటి సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ రాజధాని లేకపోవడం శోచనీయం’ అని అన్నారు. కానీ ఈ పాపం, ఈ ద్రోహం ఎవరిది? చంద్రబాబుది కాదా? రాజకీయాల్లో, పాలనలో అపార అనుభవం ఉందని 2014లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే.. ఆయన ఏం చేశారు. అమరావతిని ‘భ్రమరావతి’ని చేశారు. తాత్కాలిక రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోని రైతుల్ని ‘ఆగం’ చేశారు. ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా రైతుల వద్ద నుంచి అభివృద్ధి కోసమని వేల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ తాత్కాలిక రాజధానికి శంకుస్థాపన చేసింది కూడా మోదీనే కావడం గమనార్హం.

ALSO READ: పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీకి 55 శాతం ఓటు షేర్!

అమరావతిని ‘భ్రమరావతి’ని చేసిన బాబు!

2014 నుంచి 2019 వరకు.. చంద్రబాబు పాలనలో అమరావతి అభివృద్ధి కోసం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. రాజధాని నిర్మాణం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లలో తప్పా వాస్తవ రూపంలోకి రాలేదు. అయినా చంద్రబాబు.. ఒక సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూరుస్తూ, తనకూ, తన వారికి వ్యక్తిగత మేలు జరగడానికి మాత్రమే ‘అమరావతి’ ప్రాజెక్టును చేపట్టారని ఎన్నో విమర్శలు వచ్చాయి. అసలు అమరావతిని నిర్మించడం సాధ్యమవుతుందా అన్నదే జవాబు దొరకని ప్రశ్నగా మారింది. కానీ ఈ ఎన్నికల్లోనూ చంద్రబాబు మళ్లీ అదే పాట పాడుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని, అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. కానీ ఈసారి చంద్రబాబును నమ్మేందుకు మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు.

ALSO READ: జగనన్న స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు మీరే..!

శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందే, జగన్ చేస్తున్నారు!

రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని, ప్రభుత్వ వ్యవస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ, సచివాలయం ఉన్న చోటనే హైకోర్టు ఉండాలని ఏమీ లేదని, హైకోర్టును ఒక చోట పెట్టి మరో చోట బెంచీ పెట్టాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అధికార వ్యవస్థలు ఉండేలా చూడాలని శివరామకృష్ణన్‌ కమిటీ సూచించింది. ఈ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూచనలను అమలు చేయడానికి సిద్ధమయ్యారు. విశాఖను పాలన రాజధానిగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో స్పష్టమైన హామీనిచ్చారు. కర్నూలును ‘న్యాయ’ రాజధానిగా, అమరావతిని ‘శాసన’ రాజధానిగా చేస్తామని చెప్పారు. అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుందని, అందుకే మూడు రాజధానులు కాన్సెప్ట్ తెరమీదకి తీసుకువచ్చినట్లు చెప్పారు.

సంబంధిత కథనాలు

Back to top button