తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

YCP: పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీకి 55 శాతం ఓటు షేర్!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఈసారి వైసీపీ జైత్రయాత్ర పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి మొదలుకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు జగన్‌పైన పూర్తి విశ్వాసంతో ఉన్నారు. జగన్ మరోసారి సీఎం అయితే తమ జీవితాలు మరింత బాగుపడతాయని వారు పూర్తి విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. అందుకే పోస్టల్ బ్యాలెట్లలో తమ ఓట్లను వైసీపీకి నిక్షిప్తం చేశారు. ఈ మేరకు స్వయంగా ఆయా ఉద్యోగులే మాట్లాడుకుంటున్నారు. శనివారం ఉదయం ఆరంభమైన పోస్టల్ బ్యాలెంట్ ఓటింగ్.. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు, విభాగాల్లో పనిచేస్తోన్న సుమారు ఐదు లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ALSO READ: జగనన్న స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు మీరే..!

ఉద్యోగులంతా వైసీపీ వైపే

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికశాతం ఓట్లు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోల్ అయినట్లు, ఆ పార్టీకి సుమారుగా 55 శాతానికి మించి ఓట్లు పడ్డట్లు సమాచారం. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులందరూ మూకుమ్మడిగా వైసీపీకి ఓటు వేసినట్లు ఆ పార్టీ నేతలు భరోసా వ్యక్తంచేస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తమకు లాభసాటిగా ఉంటుందని రాష్ట్రంలోని ఉద్యోగులందరూ భావించారని, అందుకే భారీ సంఖ్యలో ఓట్లు తమకే పడ్డాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లలో మెజారిటీ ఓట్లు సాధించేందుకు వైసీపీ పోల్ మేనేజ్‌మెంటే కారణమని నేతలు చెబుతున్నారు.

ALSO READ: దుమారం రేపుతోన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. చంద్రబాబు, లోకేష్‌లపై కేసులు

షాక్‌లో చంద్రబాబు!

ఈ పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. అయినా, ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబును ఎప్పుడూ నమ్మలేదని చెప్పాలి. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని పాలించిన ఆయన పలు సందర్భాల్లో ఉద్యోగులను చిన్నచూపు చూడటం, వాళ్లకు జీతాలు ఎందుకు? అంటూ బహిరంగంగా అవహేళన చేయడం వంటివి చేశారు. ఇవన్నీ ఉద్యోగులకు గుర్తున్నాయని, అందుకే టీడీపీకి ఓటు వేయడానికి ఉద్యోగులు ఇష్టపడలేదని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా బాబు ఈ ఎన్నికల్లో ఎలాంటి హామీలను ప్రకటించలేదు. చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ మొత్తం కేటాయించినా సరిపోదు. కాబట్టి చంద్రబాబు గెలిస్తే నిధులన్నీ ఆ పథకాలకు మళ్లించి తమకు అసలు జీతాలు కూడా ఇవ్వరని భయపడిన ఉద్యోగులు జగన్‌కి ఓటేసినట్లు సమాచారం.

5 Comments

  1. పిచ్చి ఉండొచ్చు, వెర్రి ఉండొచ్చు కానీ ఎర్రి పూకుతనం మాత్రం ఉండకూడదు… కానీ ఈ అడ్మిన్ కి బోలెడు ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button