తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

AP Elections: దుమారం రేపుతోన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. చంద్రబాబు, లోకేష్‌లపై కేసులు

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. టీడీపీ చేసిన అబద్ధపు ప్రచారానికి సంబంధించిన బండారం బట్టబయలు అయింది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పలు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం లేదా సీఎం జగన్ ఇచ్చింది కాదు. ఇది ఎన్నికల సంఘం జారీ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఒక నేరం జరుగుతుందని పూర్తిగా గ్రహించిన తర్వాత దీనిపై విచరాణ చేయాలని ఏపీ సీఐడీకి కంప్లైంట్ ఇచ్చింది.

ALSO READ:  జగనన్న స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు మీరే..!

ప్రభుత్వంపై అవాస్తవాలు..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడమే కాకుండా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.

ALSO READ: రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పలమనేరు సభలో సీఎం జగన్

ఫేక్‌ ప్రచారం చేసినందుకు

ఎన్నికల సంఘం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు వైసీపీ ఫిర్యాదును పరిశీలించింది. ఈసీ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన ఈసీ చంద్రబాబు, లోకేష్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబును A1గా, లోకేష్ ను A2గా, ఇలా A10 వరకు టీడీపీ నాయకుల పేర్లు చేర్చింది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో దుమారం చెలరేగుతోంది. ఎన్నికలకు ఇంకా 8రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కీలకంగా మారిన ఈ అంశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కాగా, ఫేక్‌ ప్రచారం చేసినందుకు గాను వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button