తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

AP Elections: చంద్రబాబువి అమలుకాని హామీలు.. సూపర్ సిక్స్ పేరిట నయా మోసం!

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి అమ్ముడుపోయిన చంద్రబాబు.. మళ్లీ అధికారం కోసం కిచిడీ మేనిఫెస్టోలతో వస్తున్నాడు. ఇలాంటి నేతలకు మేనిఫెస్టో కేవలం ఒక కాగితం మాత్రమే. ఎందుకంటే అంతకుముందు అధికారంలోకి వచ్చేందుకు మేనిఫెస్టో ప్రకటించి 90 శాతానికి పైగా హామీలను తుంగలో తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.1994లో ఎన్టీఆర్‌ ఇచ్చిన హామీలకు చంద్రబాబు తిలోదకాలు పలికారు. సంపూర్ణ మద్య నిషేధం ఎత్తివేత, రూ.2 కేజీ బియ్యం రూ.5.50కు పెంపు, కోటి మందికి ఉపాధి, 35 లక్షల ఇళ్ల నిర్మాణం హామీలు ప్రకటించి.. తీరా అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. ఇప్పుడు మళ్లీ అమలు సాధ్యంకాని హామీలతో మోసగించేందుకు మళ్లీ సిద్ధమయ్యాడు.

ALSO READ: పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీకి 55 శాతం ఓటు షేర్!

రుణమాఫీ పేరుతో టోపీ..

2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ ఎన్నికల బరిలో నిల్చుంది. ఈ ఎన్నికల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం, రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలమాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకంలో రూ.25వేల డిపాజిట్, అర్హులకు మూడు సెంట్ల స్థలం, ఏడాదికి రూ.10వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు, ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీ నిర్మాణం చేస్తానని ఇలా 600కిపైగా ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలును తుంగలో తొక్కారు.

ALSO READ: దుమారం రేపుతోన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. చంద్రబాబు, లోకేష్‌లపై కేసులు

గందరగోళంగా మేనిఫెస్టో

రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో మళ్లీ ప్రజలను మోసం చేసేలా ఉందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ పేరిట టీడీపీ మేనిఫెస్టో విడుదల చేచగా.. మళ్లీ కూటమి పేరుతో జోడించి సరికొత్తగా మేనిఫెస్టోను రూపొందించారు. అయితే బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోకు కూటమి మేనిఫెస్టోకు చాలా తేడా ఉంది. మోదీ‌ గ్యారంటీల్లో అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌లను రద్దు చేస్తామని విస్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి అంగీకారం తెలపడం అంటే చంద్రబాబు, పవన్‌లు కూడా ముస్లింల రిజర్వేషన్‌లను వ్యతిరేకించినట్లే అవుతుంది. అదే విధంగా మేనిఫెస్టోలో ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ తీసుకోవచ్చని ఇచ్చారు. కానీ ప్రకటనలో మాత్రం మొత్తం జనాభాకు ఈ హామీ ఇచ్చినట్లుగా ఉంది. ఇలా ప్రతీ హామీ గందరగోళంగా కేవలం అధికారంలోకి వచ్చేందుకే ప్రకటించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button