తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌పై బోనీకపూర్‌ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవకన్యగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నటి శ్రీదేవి భర్తగా, మూవీ ప్రొడ్యూసర్‌గా సినీ ప్రేక్షకులకు తెలిసిందే. 2018లో ప్రమాదవశాత్తు శ్రీదేవి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బోనీకపూర్ తన భార్య శ్రీదేవి బయోపిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: ఆయనకు తప్ప అర్హత ఎవరికీ లేదు.. దటీజ్ మెగాస్టార్

అజయ్‌దేవ్‌గణ్‌ కథానాయకుడిగా ఆయన నిర్మించిన ‘మైదాన్‌’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. శ్రీదేవి పర్సనల్‌ విషయాలు బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదని అనుకునేది. ఆమె వ్యక్తిత్వాన్ని నేను ఎంతగానో గౌరవిస్తాను. బయోపిక్‌ సినిమా అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉంటుంది. అందుకే నేను బతికి ఉన్నంత వరకు నా భార్య, దివంగత శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించడానికి ఒప్పుకోనని నిర్మాత బోనీకపూర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button