తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Dil Raj: ‘ఫ్యామిలీ స్టార్’ మూవీపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ నిన్న విడుదలైంది. ఈ మూవీకి ప్రేక్షకుల్లో మిక్స్‌డ్ టాక్ వస్తోంది. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పారు. ఈ మూవీ తాము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యిందని, ఫ్యామిలీ ఆడియెన్స్ క్రౌడ్స్‌గా థియేటర్స్‌కి వెళ్తున్నారని దిల్ రాజు చెప్పారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.

ALSO READ: కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న ‘టిల్లు స్క్వైర్’… 100 కోట్ల దిశగా పరుగులు

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే తమ ఫ్యామిలీని గొప్ప పొజిషన్‌లోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ స్టార్స్ ఉంటారో వారిని ఐడెంటిఫై చేసి రేపటి నుంచి వారిని కలవబోతున్నాం, ఇప్పటికే ఇలాంటి మూడు ఫ్యామిలీస్‌ను సెలెక్ట్ చేశాం అని అన్నారు. పర్సనల్‌గా తాను, విజయ్, పరశురాం, మృణాల్ వెళ్లి ఆ ఫ్యామిలీ స్టార్‌ను సర్ ప్రైజ్ చేయబోతున్నామని దిల్ రాజు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button