తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP politics: బలహీన పడుతున్న టీడీపీ.. మార్పులకు అవకాశం!

రాజకీయ అనుభవం లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తులు పెట్టుకోవడంతోపాటు బీజేపీని ఛీ ఛీ అంటూనే కాళ్లబేరాలాడి టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. మళ్లీ గెలుస్తామో లేదోనని తేలడంతో కాంగ్రెస్‌తో రహస్య పొత్తు పెట్టుకున్నారు. కాగా, వైసీపీని దెబ్బతీయాలనే ఉద్ధేశంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వీల్లేకుండా అడ్డంకులు సృష్టించడంతో ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో రోజురోజుకు టీడీపీ పార్టీ మరింతగా బలహీనపడిపోతోంది.

ALSO READ: దిగ్విజయంగా 9వ రోజుకు చేరిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

స్పందన కరువు

చంద్రబాబు సభలు, రోడ్‌షోలకు జనం నుంచి స్పందన కరువైంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజాగళానికి స్పందన లేకపోవడంతో టీడీపీలో ఆందోళన పెరిగిపోతోంది. బాబు సభలకు జనం రాకపోవడంతోపాటు వచ్చిన కొద్దిమంది కూడా బాబు వేదిక మీదకు రాక ముందే వెనుదిరుగుతున్నారు. ఒకవైపు వైఎస్‌ జగన్‌ రోడ్‌షోలు, సభలకు జనం పోటెత్తుతుంటే తమ సభలకు జనం రాకపోవడంతో చంద్రబాబుతోపాటు కార్యక్రమానికి హాజరైన నేతలు తలలు పట్టుకున్నారు. దీంతో కనీస పోటీ ఇచ్చేందుకైనా మరింత బలమైన అభ్యర్థులను నిలపాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. దారిపొడవునా గుండెల నిండా ప్రేమ!

మార్పు చేసే అవకాశం..

టీడీపీకి వ్యతిరేకత రావడంతో పలు స్థానాల్లో మార్పు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు కూటాయించిన సీట్లల్లో కోత విధించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అనపర్తి సీటు మళ్లీ తిరిగి టీడీపీకి కేటాయించేందుకు బీజేపీ, టీడీపీ నేతలతో చర్చలకు తెర లేపనున్నట్లు తెలుస్తోంది. అలాగే జనసేన­కు కేటాయించిన నర్సాపురం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొ­త్తంగా 20కిపైగా ఎమ్మెల్యే, ఒకట్రెండు ఎంపీ స్థా­నా­ల్లో అభ్యర్థులను మార్చి వైసీపీకి పోటీ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button