తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: అందరికీ మంచి చేశా.. ఇలా చంద్రబాబు చెప్పగలడా?.. సీఎం జగన్

రాష్ట్రంలో ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేయడంతోపాటు అందరికీ మంచి చేశానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కావలిలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై విమర్శలు చేశారు. చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా.. 14 ఏళ్లు సీఎంగా, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పడమే.. కానీ, ఈ 14 ఏళ్ల కాలంలో ఓ మంచి పథకం తీసుకొచ్చా అని చెప్పే దమ్ముందా? అని నిప్పులు చెరిగారు. కనీసం ఇచ్చిన హామీల్లో 10శాతం అయినా అమలు చేశావా? ఎన్నికలు వస్తేనే రంగురంగుల మేనిఫెస్టో గుర్తొస్తుందా? అంటూ చురకలు వేశారు.

ALSO READ: గూగుల్‌ ట్రెండ్స్‌.. టాప్ లేపిన సీఎం జగన్

మోసం చేయడమే అలవాటు..

రానున్న ఎన్నికలు మన రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని జగన్ అన్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబు, జగన్ మధ్య కాదని, ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్నా­యన్నారు. మీ బిడ్డ జగన్‌ పేదల పక్షం, ప్రజల పక్షం అని గర్వంగా చెబుతున్నానన్నారు. ఈ యుద్ధంలో అటువైపు చంద్రబాబు, దత్తపుత్రుడు.. ఇటువైపు ధర్మాన్ని గెలిపించాలని కోరుతున్న జగన్ ఉన్నారన్నారు. మే 13న జరిగే ఈ ఎన్నికల్లో జగన్‌కు మద్దతు ఇవ్వడానికి మీరంతా సిద్ధమేనా? అని ప్రజలను ప్రశ్నించారు.

ALSO READ: బలహీన పడుతున్న టీడీపీ.. మార్పులకు అవకాశం!

కుప్పం టూ ఇచ్చాపురం

రాష్ట్రంలో కుప్పం టూ ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికి వెళ్లినా అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. సచివాలయ వ్యవస్థ, వలంటీర్‌ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్, మారిన ఇంగ్లిష్‌ మీడియం స్కూలు, మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్‌ కనిపిస్తుందన్నారు. కానీ చంద్రబాబు పాలనలో ఏనాడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. మీ జగన్ హయాంలో లంచాలు, వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడన్నారు. గత ఎన్నికల్లో ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే చాలు ప్రతీ ఇంటికి మంచి చేసే కార్యక్రమం చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button