తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Google Trends: గూగుల్‌ ట్రెండ్స్‌.. టాప్ లేపిన సీఎం జగన్

ఎన్నికల వేళ సీఎం జగన్ టాప్ లేపేశారు. రాష్ట్రంలోని ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువగా ఏ టాపిక్‌పై ఆసక్తి కనబరుస్తున్నారనే విషయంపై ట్రండ్ విశ్లేషణలో సీఎం జగన్ టాప్‌లో ఉండగా.. చంద్రబాబు దగ్గరలో కూడా లేకపోవడం గమనార్హం. సీఎం జగన్ రాజకీయ ప్రొఫైల్, కార్యకలాపాలు ఏపీ ప్రజల దృష్టిని ఆకర్షించాయని ఈ పరిణామం సూచిస్తోంది. కాగా, గత 90 రోజులుగా ఎక్కువమంది సీఎం జగన్ గురించే వెతికినట్లు గూగుల్ సెర్చ్ అనలిటిక్స్ వెల్లడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన డేటా ట్రెండ్‌ వైరల్ అవుతోంది.

ALSO READ: బలహీన పడుతున్న టీడీపీ.. మార్పులకు అవకాశం!

90 రోజులుగా ట్రెండ్స్‌ ఇలా!

గూగుల్‌ ట్రెండ్స్‌కు సంబంధించి రెండు రకాల రిపోర్టులు పరిశీలించారు. ఒకటి 90 రోజులకు సంబంధించి, మరొకటి గత 30 రోజులకు సంబంధించి. ముందుగా గడిచిన 90 రోజుల ట్రెండ్స్‌ చూస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ గురించి ఒక్కో యూజర్ 39 నిమిషాలు సమయం కేటాయించగా.. చంద్రబాబు వివరాల కోసం కేవలం12 నిమిషాలు మాత్రమే వెచ్చించారు. కాగా, ఈ 90 రోజుల్లో సీఎం జగన్‌కు దగ్గరగా చంద్రబాబు వచ్చింది ఒకే ఒక సారి. అది కూడా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు విషయంలో చంద్రబాబు గురించి వెతికారు. అదే విధంగా గత 30 రోజులలో గూగుల్‌ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ వివరాల గురించి 45 నిమిషాలు కేటాయించగా.. చంద్రబాబు గురించి 16 నిమిషాలు మాత్రమే వెచ్చించారు.

ALSO READ: దిగ్విజయంగా 9వ రోజుకు చేరిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

సీఎం జగన్‌ వేవ్‌..

గూగుల్ సెర్చ్‌లో సీఎం జగన్‌ వేవ్‌ నడుస్తోంది. జగన్ కోసం అభిమానులు గూగుల్లో వెతుకులాడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది ప్రజల సెంటిమెంట్‌కు కీలక సూచికగా ఉపయోగపడనుంది. అంతే కాకుండా సిద్దం, మేమంత సిద్ధం ఈవెంట్‌ల భారీ విజయం అందడంతో పాటు సంక్షేమ పథకాలు, సులభ పాలన వంటివి ప్రజాదరణకు నిదర్శనం. గతంలోనూ సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్‌లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయింది. ఇలా ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నిండిపోయింది. తాజాగా, గూగుల్ సెర్చ్‌లో సీఎం జగన్ హవా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button