తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

CBN: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు మళ్లీ అడ్డుపడిన చంద్రబాబు!

ప్రజల నోటి కాడి కూడును లాక్కొనే వారిని ఏమనాలి? సింపుల్‌గా చెప్పాలంటే చంద్రబాబు అంటే సరిపోతుందేమో కదా. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఈ విషయాన్ని ఎవరైనా సులభంగానే ఒప్పుకుంటారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు.. ప్రజల సంక్షేమానికి అడ్డుపడే విషయంలో ఇంతకు మించి దిగజారిపోరని అనుకున్న ప్రతిసారి ఆయన అంతకుమించి దిగజారుతున్నారు. మొన్నటి దాకా వృద్ధులు, వికలాంగులు, మహిళలకు అందిస్తున్న పెన్షన్లపై కక్ష కట్టారు. ఇప్పుడేమో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల నగదు విడుదలకు అడ్డుపడుతున్నారు. సంక్షేమ పథకాల నిధులు లబ్ధిదారులకు అందకుండా కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారు.

ALSO READ:  టీడీపీని ఆవరించిన ఓటమి భయం.. చేతులెత్తేసిన అభ్యర్థులు!

కోర్టు అనుమతిచ్చినా.. వెనక్కి తగ్గని బాబు

ఆసరా, చేయూత, రైతు ఇన్‌పుట్ సబ్సిడీ, వసతి దీవెన, విద్యాదీవెన, లా నేస్తం, రైతు భరోసా వంటి పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఈ దఫా నగదు సాయం అందాల్సి ఉంది. ఈ నగదు విడుదలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. కానీ చంద్రబాబు ఒక్కసారిగా సీన్‌లోకి ఎంటరయ్యారు. ఈ సమయంలో నగదు జమ చేస్తే.. అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న సాకుతో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ నగదు విడుదలకు బ్రేక్ వేసింది. ఈ సమయంలో నగదు విడుదల చేయకపోతే ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని పేదలు, మహిళలు, రైతులు, పిల్లలందరి పక్షాన సీఎం జగన్ ఈసీతోనూ, కోర్టులోనూ పోరాడారు. ఈ అంశంపై హైకోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత ఈసీ నిర్ణయంపై ఎట్టకేలకు హైకోర్టు స్టే విధించింది. నగదు విడుదలకు ప్రభుత్వానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.

ALSO READ: పవన్ కళ్యాణ్‌ని ఓడించకపోతే రాష్ట్రానికే ప్రమాదం: రాజేశ్ మహాసేన

మళ్లీ కోర్టులో పిటిషిన్ !

చంద్రబాబు అండ్ గ్యాంగ్ అంతంటితో ఆగలేదు. ‘నవతరం’ పార్టీతో మళ్లీ కోర్టులో పిటిషన్ వేయించారు. దీంతో నగదు విడుదల మరోసారి వాయిదా పడింది. నోటి దాకా వచ్చిన కూడు లబ్ధిదారులకు అందకుండా మరోసారి మాయమైపోయింది. దీన్ని బట్టి చూస్తే అసలు చంద్రబాబు ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తున్నది ఎవరితో? వైసీపీ, సీఎం జగన్‌తోనా, లేదా రాష్ట్ర ప్రజలతోనా? ఆయనకు ప్రజలపై ఎందుకింత కక్ష? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరిలో మెదులుతున్న ప్రశ్నలివి. అందుకే ఈసారి చంద్రబాబుకు మరోసారి గట్టిగా సమాధానం చెప్పేందుకు వారంతా సిద్ధమైపోయారు. మే 13న వైసీపీ ‘ఫ్యాన్’ గుర్తుపై చాలా బలంగా నొక్కి, రాష్ట్రానికి పట్టిన ‘చంద్ర’గ్రహణాన్ని శాశ్వతంగా తొలగించేందకు సిద్ధపడ్డారు.

One Comment

  1. Cheta kakaoiyena sakulu chetunna governament 18 750 ceyuta 15000 ebcnastam e account ke velle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button