తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

CBN: పవన్ కళ్యాణ్‌ని ఓడించకపోతే రాష్ట్రానికే ప్రమాదం: రాజేశ్ మహాసేన

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు మార్క్ రాజకీయం మరోసారి తేటతెల్లమైంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేశ్ మహాసేన పవన్‌పై ఉన్నట్టుండి రివర్స్ అయ్యారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాల్సిందేనని, ఆయనను ఓడించకపోతే రాష్ట్రానికే ప్రమాదమంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌ (మహాసేన మీడియా)లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లు తొలగిస్తామని చెబుతున్న బీజేపీతో పవన్ జతకట్టడాన్ని, బీజేపీని సూపర్ పవర్ శక్తిగా మార్చడం కోసం ప్రాణత్యాగమైనా చేస్తానని పవన్ అనడాన్ని రాజేశ్ తప్పుపట్టారు. బడుగు, బలహీన వర్గాల కోసం నిలబడటంలో వైఎస్ జగనే ఎంతో మేలని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో వ్యతిరేకంగా ప్రచారం చేసి, ఆయనను ఓడగొడతామని అన్నారు. మరి రాజేశ్ మహాసేన ఉన్నట్టుండి పవన్‌కు వ్యతిరేకంగా మారడానికి కారణం ఏంటి? అంటే.. ఇదంతా చంద్రబాబు మాస్టర్ స్కెచ్ అనే అర్థం చేసుకోవాలి.

ALSO READ: ఏపీని సంక్షోభంలోకి నెట్టేందుకు చంద్రబాబు భారీ స్కెచ్!

రాజేశ్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు, లోకేశ్?

ఈ ఎన్నికల్లో ఎలాగూ కూటమికి ఓటమి తప్పదని, జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలుపొందనని భావిస్తున్న చంద్రబాబు భారీ కుట్రకు తెరలేపారు. రాజేశ్ మహాసేన ద్వారా జనసేన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించి, తీరా ఎన్నికల్లో కూటమి ఓడిపోయాక.. అందుకు కారణం పవన్, జనసేననే అని ప్రజలకు తెలియచెప్పడం చంద్రబాబు ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు, లోకేశ్ కలిసి రాజేశ్ మహాసేనను పవన్ కళ్యాణ్‌పై వ్యతిరేక ప్రచారం చేసేందుకు ఉసిగొల్పారన్నది సుస్పష్టం. ఎందుకంటే, ఎన్నికలకు ఇంకా ఐదు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో టీడీపీ సపోర్ట్ లేకుండా రాజేశ్ మహాసేన.. పవన్‌పై ఇంతటి వ్యాఖ్యలు చేయలేరు కదా. ఇదే విషయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అందుకే రాష్ట్రంలోని బలహీన వర్గాలు, మేధావులు, కాపు సామాజిక వర్గానికి చెందిన వారెవరూ చంద్రబాబును నమ్మేందుకు సిద్ధంగా లేరు.

ALSO READ: ఏపీకి రాజధానిని లేకుండా చేసిన ‘పాపం’ చంద్రబాబుది కాదా?

ఎవరీ రాజేశ్ మహాసేన?

2019 ఎన్నికలలో వైసీపీలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం పని చేసిన రాజేశ్ మహాసేన.. ఫలితాల తర్వాత కొంత కాలానికి జగన్ సర్కారుని వ్యతిరేకిస్తూ యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలను చేశారు. అలా జనసేన పార్టీకి దగ్గర అయిన ఈయన.. పవన్ కోసం యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు చేశారు. ఆ తర్వాత సొంతంగానే ఒక పార్టీ పెట్టాలని ఆలోచించినప్పటికీ కొన్ని కారణాల చేత వెనుకడుగు వేసి టీడీపీలో చేరి కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం సీటు సంపాదించుకొని మళ్లీ ఆ సీటుని జనసేన కోసం వదిలేసుకున్నారు. కానీ ఇప్పుడు జనసేన పార్టీపైన సంచలన వీడియో చేసి చర్చనీయాంశంగా మారారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button