తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదు: పోసాని మురళి

రాజకీయాలకు చిరంజీవి అన్ ఫిట్ అని పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవి ప్రజారాజ్యం పెడితే 18 సీట్లు వచ్చాయని, కానీ ఏనాడైనా రాష్ట్ర ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించారా? అని ప్రశ్నించారు. ఇక ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని చెప్పి, ఇప్పుడు మళ్లీ జనసేన తరపున ఎలా ప్రచారం చేస్తారు? అని ప్రశ్నించారు. చిరంజీవి వెన్నుపోటు పొడిచినందుకు ఎంతోమంది కాపులు బలయ్యారని, చిరంజీవి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అర్బన్ ప్రాంతాల్లో ఉండే ధనవంతులకు గ్రామాల్లో ఉండే పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి? అని అన్నారు.

ALSO READ: పవన్ కళ్యాణ్‌ని ఓడించకపోతే రాష్ట్రానికే ప్రమాదం: రాజేశ్ మహాసేన

ప్రజలపై ప్రేమ లేదు..

చిరంజీవికి ప్రజలు అంటే లెక్క లేదని, ప్రజా సేవ అని పార్టీ పెట్టీ మూసేశాడని పోసాని ఆరోపణలు చేశారు. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదు.. సినిమా లానే రాజకీయాలను బిజినెస్ లా చూశారన్నారు. రెండు ఎంపీ సీట్ల నుంచి బీజేపీ అధికారంలోకి ఎలా రాగలిగింది? అప్పట్లో వాజ్‌పేయి, అద్వానీ కష్టపడి పనిచేసి ప్రజాదరణ పొందారని, చిరంజీవి మాత్రం తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారన్నారు. ఇక రాజకీయాల్లోకి రానని చెప్పి, మళ్లీ ఇప్పుడు రాజకీయ స్టేట్మెంట్ ఇస్తున్నారని అన్నారు. ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదని, చిరంజీవి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

ALSO READ: ఏపీని సంక్షోభంలోకి నెట్టేందుకు చంద్రబాబు భారీ స్కెచ్!

బాబు పాలనలో పేదలు జీవచ్ఛవం

అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు కాదని, ప్రజల అభివృద్దే రాష్ట్ర అభివృద్ధి పోసాని అన్నారు. చంద్రబాబు పాలనలో పేదలు జీవచ్ఛవంలా ఉండిపోయారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పాలన అందించడంతో పేదలు అభివృద్ధిలోకి వచ్చారని చెప్పారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏనాడైనా సంపద సృష్టించారా? ఆయన హయాంలో రెవెన్యూ లోటు బడ్జెటే ఉందని, జనాన్ని మోసం చేస్తూ ఇంతకాలం చంద్రబాబు కాలం వెల్లదీశారు. తాను గెలిస్తే తాకట్టులో ఉన్న బంగారం బయటకు తెస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మిన మహిళలు, రైతులు నిలువునా మోసపోయారన్నారు. కానీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో మానవ నిర్మాణం చేపట్టారని, పేదోడి చదువులు, ఆరోగ్యం కోసం జగన్ కష్టపడుతున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button