తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

AP Elections: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్‌

ఏపీలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందని వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు వైఎస్సార్‌ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్‌ మాట్లాడారు. ముస్లింలకు సామాజిక పరిస్థితిని ఆధారంగా కల్పిస్తోన్న మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు ఎలా కలిసి ఉన్నాడో చెప్పాలన్నారు. ఓట్ల కోసం మైనార్టీలకు మభ్యపెట్టే మాటలు చెబుతాడని, మైనార్టీ రిజర్వేషన్లు వ్యతిరేకించే బీజేపీతో కలిసి ఉంటోన్న చంద్రబాబుకు మించిన ఊసరవెల్లి రాజకీయాలు ఎవరు చేయరన్నారు. ఆరునూరైనా మైనార్టీ రిజర్వేషన్లను కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు.

ALSO READ: ఇష్టానుసారంగా హామీలు ఇస్తే నిధులు ఎలా వస్తాయి? ఇంటర్వ్యూలో సీఎం జగన్ సంచలన విషయాలు

మోదీ సమక్షంలో బాబు మాట్లాడగలడా?

చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయమని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. మైనారిటీలకు రిజర్వేషన్లపై మోదీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలడా? అని సీఎం జగన్‌ నిలదీశారు. అన్ని మతాల్లోను బీసీలు, ఓసీలు ఉంటారని, మైనార్టీలను వేరుగా చూడటం, మైనార్టీలకు నోటి వరకు వచ్చిన కూడు తీసేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కానీ వైసీపీ ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపాదికన ఇచ్చింది కాదని, ముస్లింలలో ఉన్న పటాన్‌, సయ్యద్‌, మొగల్స్‌ లాంటి వాళ్లకు ఇవ్వడం లేదని, కేవలం వెనుకబాటు తనంగా ఆధారంగానే రిజర్వేషన్లు ఇచ్చినట్లు ప్రకటించారు.

ALSO READ: ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదు: పోసాని మురళి

ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు..

58నెలల కాలంలో వైసీపీ మైనార్టీలకు సముచితం స్థానం కల్పించినట్లు జగన్ చెప్పారు. మైనారిటీల కోసం షాదీ తోఫా లాంటి పథకాలు, ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు, మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవి, ఏడుగురికి ఎమ్మెల్యేలుగా అవకాశమిచ్చామన్నారు. ఇలా 175 ఎమ్మెల్యే సీట్లలో నాలుగు శాతం 7 ఎమ్మెల్యే సీట్లను మైనార్టీలకు కేటాయించామన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతీసారి నేను ఎందుకు అంటానంటే.. ఎంతగా వారి మీద ప్రేమ చూపిస్తే వెనకబడిన ఆ వర్గాలకు రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

2 Comments

  1. I thought you did a great job here. The language is excellent and the picture is tasteful, but you come across as nervous about what you might say next. If you preserve this walk, I have no doubt that I will return more often.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button