తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ‘టిల్లు స్క్వేర్’

Pakka Telugu Rating : 3.25/5
Cast : సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్,మురళీ శర్మ, మురళీధర్ గౌడ్,నేహా శెట్టి, ప్రిన్స్
Director : మ‌ల్లిక్ రామ్
Music Director : రామ్ మిరియాల
Release Date : 29/03/2024

చిన్న సినిమాలతో హీరోగా కెరీయర్ ని స్టార్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు మూవీతో సూపర్ హిట్ అందుకొని ఇండస్ట్రీని మొత్తం తన వైపుకు తిప్పుకున్నాడు. అటువంటి చిత్రానికి సీక్వెల్ వస్తుందంటే మామూలుగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2022లో రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించిన డీజే టిల్లుకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ మూవీ తెర‌కెక్కింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఈరోజు రిలీజైంది. ఎన్నో అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? టిల్లు స్క్వేర్ తో సిద్దు ఎటువంటి మ్యాజిక్ చేశాడు? ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అయింది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం!

కథ:

డిజే టిల్లు( సిద్ధు జోన్నలగడ్డ) తల్లిదండ్రులతో కలిసి ఈవెంట్స్ చేసుకుంటూ ఆ కార్యక్రమాలకు టిజే ప్లే చేస్తూ ఉంటాడు. గతంలో తనకు జరిగిన అనుభవాలను ద‌ృష్టిలో ఉంచుకొని అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకుంటాడు. అదే టైంలో ఓ పబ్ లో లిల్లీ( అనుపమ పరమేశ్వరన్) టిల్లుకు పరిచయం అవుతుంది. ఫస్ట్ లుక్ లోనే లిల్లీని చూసి ప్రేమలో పడి ఆమెను ఇంప్రెస్ చేసే పనిలో ఉంటాడు. టిల్లు మాటలకు పడిపోయిన లిల్లీ అదే రోజు నైట్ ఒకే రూమ్ లో ఏకాంతంగా గడుపుతారు. మరుసటి రోజు ఉదయం టిల్లు నిద్ర లేచేసరికి లిల్లీ కనిపించదు. అప్పటి నుంచి టిల్లు, లిల్లీని కనిపెట్టడానికి రకారకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఉపయోగం లేకుండా పోతుంది. అనుకోకుండా ఒక రోజు ఆసుపత్రిలో లిల్లీ కలిసి తాను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. దాంతో లిల్లీని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి ఇంటికి తీసుకెళ్తాడు. ఈ తరువాత టిల్లు బర్డ్ డేకి మళ్లీ గతంలో జరిగినట్టే షాకులు తగులుతాయి. ఆ షాకులు ఏంటి? అసలు లిల్లీ ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? మధ్యలో ఈ షేక్ మహబూబ్ (మురళీ శర్మ) ఎవరు? అనేది విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

కథనం-విశ్లేషణ:

గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన చిత్రాలకు సీక్వెల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలాంటివి మరింత హైప్ క్రియేట్ చేసుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా నుంచి అలా వచ్చిన మూవే ‘టిల్లు స్క్వేర్’. డిజే టిల్లు సూపర్ హిట్ కావడంతో టిల్లు స్క్వేర్ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. వాటిని ద‌ృష్టిలో ఉంచుకొని దర్శకుడు ఈ మూవీని తీర్చిదిద్దినట్లు అనిపిస్తుంది. కానీ ఫస్టాఫ్ లో ఎక్కువగా కామెడీ పై దృష్టిపెట్టినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో పెద్దగా కథేమి ఉండదు. సిద్దు మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుంది. టిల్లుకి లిల్లీ కలవడం ప్రెగ్నెంట్ అవ్వడం ఇదంతా చూసిన ప్రేక్షకుడికి లిల్లీ కావాలనే చేస్తున్నట్లు అనిపిస్తుంది. గతంలో ఒక్కసారి అమ్మాయి చేతిలో మోసపోయాడు కాబట్టి అమ్మాయి మంచి వాళ్లు కాదని తన అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. కానీ టిల్లు అదంతా పట్టించుకోకుండా లిల్లీని రియల్ గా ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలోనే టిల్లు బర్త్ డే వస్తుంది. అదే రోజు రాత్రి లిల్లీ తను బర్త్ డే పార్టీకి రావడంలేదని తనకు ఓ ప్రాబ్లమ్ వచ్చిందని చెబుతుంది. ఇక అక్క డి నుంచి టిల్లు కష్టాలు మొదలవుతుంటాయి. ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకుల్లో సెకండాఫ్ పై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

తనకు వచ్చిన సమస్య నుంచి టిల్లు ఎలా బయటపడ్డడన్నందే సెకడాఫ్ లో చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటాయి. పోలీస్ ఆపరేషన్ లో డాన్ షేక్ మహబూబ్ ను చంపేందుకు టిల్లు వెళ్లి చిక్కుల్లో పడటం తర్వాత ఏమవుతుందో అని సగటు ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు, టర్న్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ప్రియాంక జవాల్కర్ తో పాటు నేహా శెట్టి చెరొక సీన్లో ఆకట్లుకునేలా కనిపించారు. ముఖ్యంగా రాధిక కనిపించగానే థియేటర్లలో ఒక రేంజ్ రెస్పాన్స్ కనిపించేలా ఆమె ఎంట్రీ ఉంది.షేక్ మహబూబ్ కు పోలీస్ ఆపీసర్స్ లోనే ఒకరు సహాయం చేస్తూ ఉంటారు. అది ఎవరనే దానిపై ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించి ఉండరు. డీజే టిల్లు మాదిరిగానే చివరికి వచ్చే సారికి హీరోదే పై చేయి అవుతుంది. అంతా సేపు హీరో బకరా అవుతున్నడనుకున్న వారికి క్లైమాక్స్ లో టిల్లు ఇచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదు.
అయితే ఈ సినిమాకి ఫస్టాప్ లో కథ ఏమి ఉన్నట్లు అనిపించదు. కథలోకి వెళ్లడానికి టైం తీసుకున్నాడు డైరెక్టర్ మ‌ల్లిక్ రామ్. అలాగే హీరో ఇంట్రడక్షన్ సీన్ అతిగా అనిపిస్తుంది. ఈ రెండు విషయాలలో డైరెక్టర్ జాగ్రత్త వహించి ఉంటే సినిమా మరోలా ఉండేదనిపిస్తుంది.

నటీ-నటులు:

డీజే టిల్లు లో తన ఫెర్మామెన్స్ తో అదరగొట్టిన సిద్ధు జోన్నలగడ్డ ఈ సినిమాలో కూడా రెచ్చిపోయాడు. తన కామెడీ టైమింగ్ తో థియేటర్లలో నవ్వులు పూయిస్తాడు. సిద్దు తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు.సినిమా మొత్తం సిద్దు వన్ మ్యాన్ షో లాగే అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి ఈ మూవీలో మంచి క్యారెక్టర్ లభించింది. తన పాత్రలో అనేక షేడ్స్ కనిపిస్తుంటాయి. తన క్యారెక్టర్ ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత అనుపమ ఇంకా బిజీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. టిల్లు తండ్రి పాత్ర చేసిన మురళీధర్ గౌడ్ కి మరొకసారి మంచి పాత్ర పడింది. ఆయనకు మంచి నటనకు స్కోప్ దొరికింది. మురళీ శర్మ, ప్రిన్స్ వంటి వాళ్లు కొన్ని సీన్స్ లో కనిపించినా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు అయితే కాదు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు మ‌ల్లిక్ రామ్ నిజాయితీగా పనిచేసినట్లు అనిపిస్తుంది. కథ పర్వాలేదు అనిపించినా కథనం విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో అనిపిస్తుంది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. డబ్బు విషయంలో ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు. భీమ్స్ అందించిన బ్యాక్ గ్రాండ్ స్కోర్ తో పాటు రామ్ మిరియాల ఇచ్చిన రీమిక్స్ సాంగ్ సినిమాకి బాగా ప్లస్ అయింది. సినిమాటోగ్రాఫర్ సినిమా మొత్తాన్ని కలర్ పుల్ గా చూపించడంలో సక్సస్ అయ్యారు. ఎడిటర్ పనితనం బాగుంది.

ప్లస్ పాయింట్స్:

సిద్దు జోన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్

కామెడీ

యాక్షన్ సీన్స్

ట్విస్టులు

సాంగ్స్, బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

ఫస్టాఫ్ లో కథ లేకపోవడం

పంచ్‌లైన్: టిల్లు మ్యాజిక్ రిపీట్

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button