తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tillu Square: టిల్లు స్క్వేర్ ఓటిటి పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీజే టిల్లు సూపర్ సక్సెస్ సాధించిన క్రమంలో సీక్వెల్ టిల్లు స్క్వేర్ పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సినిమా చూసిన ఆడియన్స్ కూడా అదే హైప్ ఫీలవుతున్నారు. సినిమా సూపర్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. టిల్లన్న మ్యాజిక్ మళ్లీ వర్కౌట్ అయ్యింది అంటూ చెప్పుకుంటున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది.

Also read: Aditi Rao: వారికి పెళ్లి కాలేదట.. క్లారిటీ ఇచ్చిన అదితి

ఇదిలా ఉంటే.. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా హక్కులను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఇందుకోసం రూ.35 కోట్లు ఖర్చు చేసిందని టాక్. కేవలం ఈ సినిమాకు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ రేంజ్ లో ఖర్చు చేసుంటారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. థియేటర్స్ లో విడుదలైన నెలరోజుల తరువాత మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. అంటే.. ఏప్రిల్ ఎండింగ్ లో లేదా మే మొదటి వారంలో టిల్లు స్క్వేర్ ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక టిల్లు స్క్వేర్ సినిమా కథ విషయానికి వస్తే.. మొదటి పార్టులో రాధిక చేతిలో మోసపోయిన టిల్లుకి ఒక పార్టీలో లిల్లీ పరిచయం అవుతుంది. ఆమె పరిచయం టిల్లు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది? ఆ క్రమంలో టిల్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ. అదే కథను కాస్త ఎంటర్టైనింగ్ వేలో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button