తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Aditi Rao: వారికి పెళ్లి కాలేదట.. క్లారిటీ ఇచ్చిన అదితి

తమిళ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి బుధవారం పెళ్లి చేసుకున్నారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో వీరి వివాహం రహస్యంగా జరిగిందని వార్తలు వినిపించాయి. కానీ, ఈ పెళ్లికి సంబందించిన ఒక ఫోటో గానీ, వీడేమో గానీ విడుదల కాలేదు.

Also read: Manamey: శర్వానంద్ మూవీ మనమే నుంచి అప్డేట్.. ఇక నా మాటే సాంగ్ రిలీజ్

నిజంగా ఈ పెళ్లి జరిగిందా అని జనాలు అనుమానాలో ఉన్న తరుణంలో ఒక పోస్ట్ తో పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది హీరోయిన్ అదితి రావు హైదరి. ఈ పోస్ట్ లో అదితి, సిద్దార్థ్ తీసుకున్న సెల్ఫీ ఫోటోని షేర్ చేస్తూ.. అతను ఓకే చెప్పాడు, ఎంగేజ్డ్ అని పోస్ట్ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ ఫొటోలో ఇద్దరు కొత్త ఉంగరాలతో కనిపించారు. దీంతో ఈ జంటకు కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగిందని, పెళ్లి కాదని క్లారిటీ వచ్చేసింది.

ఏదైతేనేం.. దాదాపు మూడేళ్ళుగా వినిపిస్తున్న ఈ జంట ప్రేమ వార్తలకు నేడు అధికారిక ప్రకటన ఇచ్చేసింది అదితి. త్వరలోనే పెళ్లి ఎప్పుడు అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అదితి షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవ్వగా.. నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button