తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Manifesto: వైసీపీ మేనిఫెస్టో నేడే.. రైతు కుటుంబాల కోసం కీలక నిర్ణయం!

ఏపీలో మే 13న జరగనున్న ఎన్నికల సమరంలో భాగంగా అధికార పార్టీ వైసీపీ మేనిఫెస్టో విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మేనిఫెస్టోను తాడేపల్లి సీఎం కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా పార్టీ ముఖ్యనేతల సమక్షంలో మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాలు విజయవంతం కావడంతో ఈసారి నవరత్నాలు ప్లస్ పేరిట మేనిఫెస్టోను రూపకల్పన చేశారు.

ALSO READ: శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వారసులు?

మేనిఫెస్టోలో కీలక అంశాలు ఇవే!

నవరత్నాలు ప్లస్ పేరిట విడుదల చేయనున్న మేనిఫెస్టోలో పలు కీలక అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానంగా రైతులు, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. పేజీల కొద్దీ హామీలు లేకుండా ఒకే ఫోల్డర్ లో మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లక్షల కుటుంబా స్థితిగతులను మార్చేసిన పథకాలను తదుపరి టర్మ్‌లోనూ కొనసాగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిందని, ఈ మేరకు మేనిఫెస్టోను ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

ALSO READ: ఎల్లుండి నుంచే సీఎం వైఎస్ జగన్‌ ఎన్నికల ప్రచారం.. ప్రతి రోజూ మూడు బహిరంగ సభలు!

రూ.50వేల పెళ్లి సాయం

కల్యాణ మస్తు, షాదీ తోఫా తరహాలో రైతు కుటుంబాలకు పెళ్లి సాయం అందనుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా రైతు కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయాన్ని అందించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు అందిస్తున్న తరహాలనే రైతు కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు రూ.50వేల వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని మేనిఫేస్టోలో చేర్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button