తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YS Jagan: శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వారసులు?

వైసీపీ అధినేత, సీఎం జగన్ కడప గడ్డపై ఇచ్చిన ప్రసంగం దద్దరిల్లింది. ప్రతీ పదంలోనూ పంచ్ విసిరారు. వివేకా రెండో పెళ్లి నుంచి హత్య వరకు ప్రతీ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చారు. పులివెందులలో జగన్ ఇచ్చిన స్పీచ్‌కు ప్రత్యర్థులు షేక్ అయ్యారు. కడప జిల్లా ప్రజలను నేను అడుగుతున్నా.. పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లు వైఎస్సార్‌ వారసుళ్లా?.. అని ప్రశ్నించారు. ఎక్కడా చెల్లెళ్ల పేరు పలకకుండా క్లీన్‌చిట్ చేశారు.

వైఎస్సార్‌ పేరును ఛార్జిషీట్‌లో చేర్చింది ఎవరు?

మహానేత వైఎస్సార్ మీద కక్ష్యపూరితంగా, కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత వైఎస్సార్ మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? వైఎస్సార్‌ పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చింది ఎవరు? వైఎస్సార్‌ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైసీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లా? అని సూటిగా ప్రశ్నించారు. రాజకీయంగా అణగతొక్కాలని, కాంగ్రెస్, టీడీపీతో కలిసిపోయి వైఎస్సార్ పేరు కనిపించకుండా చేయాలని కుట్రలు అమలు చేస్తున్న మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీలో చేరిన వీళ్లా వైఎస్సార్ వారసులు ? అని అడిగారు. వైఎస్సార్ బతికి ఉన్నంత కాలం ఎవరితో పోరాటం చేశారో ఆలోచన చేయాలని అడుగుతున్నానని అన్నారు.

కడప జిల్లా ప్రజలకు తెలుసు

వైఎస్ వివేకాను ఎవరి చంపారో..ఎవరు చంపించారో? ఆ దేవుడితోపాటు జిల్లా ప్రజలకు తెలుసన్నారు. కానీ మాపై బురద చల్లేందుకు ఇద్దరి చెల్లెమ్మలను ఎవరు పంపించారో.. వారి వెనకలా ఎవరు ఉన్నారనేది మీకందరికీ కనిపిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను అన్యాయంగా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే తిరుగుతున్నారంటే.. అర్థం ఏంటి అన్నారు. వివేకాకు రెండో భార్య ఉన్న మాట వాస్తవమా? కాదా? సంతానం ఉన్నది వాస్తవం కాదా? అని ప్రస్తావించారు. అవినాష్ ఎవరు ఫోన్ చేస్తే అక్కడి వెళ్లాడు? వంటి ప్రశ్నలపై మాట్లాడితే చాలు వారి మీద కూడా కుట్ర రాజకీయాలు చేయడం ధర్మమేనా? అని జగన్ అడిగారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని.. నేను బలంగా నమ్మాను కనుక టికెట్ ఇచ్చానని వెల్లడించారు. అవినాష్‌ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button