తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

TDP: ఏపీని సంక్షోభంలోకి నెట్టేందుకు చంద్రబాబు భారీ స్కెచ్!

రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్చుకోలేేకపోతున్నారా? ఈ ఎన్నికల్లో తనకు ఎలాగూ ప్రజలు ఓటు వేయరని భావిస్తున్న ఆయన.. వారిపై కక్ష సాధించాలని నిర్ణయించుకున్నారా? రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేసి ఏపీని పెను సంక్షోభంలోకి నెట్టేయాలని ఆయన కుట్ర చేస్తున్నారా? అవును.. ముమ్మాటికి ఇవన్నీ నిజాలే. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరే అందుకు సాక్ష్యం. మొన్నటి దాకా పెన్షన్‌దారులపై కక్షతో వారికి అందాల్సిన పింఛన్ సొమ్మును అడ్డుకున్నారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులని కూడా చూడకుండా వారిని ముప్పుతిప్పలు పెట్టారు. తీవ్ర ఎండల్లో అష్టకష్టాలు పడితేగానీ ఫించన్ సొమ్మును అందుకోలేని పరిస్థితిని సృష్టించారు. దానిని మరువక ముందే విద్యార్థులు, రైతులు, మహిళలపై మరో భారీ కుట్రకు తెర లేపారు.

ALSO READ: చంద్రబాబువి అమలుకాని హామీలు.. సూపర్ సిక్స్ పేరిట నయా మోసం!

విద్యా దీవెన, ఇన్‌పుట్ సబ్సిడీ, ‘చేయూత’ పథకాలకు ఈసీ బ్రేక్

వైసీపీ మీద అడుగడుగునా కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు నాయుడు చివరకు విద్యార్థులు, రైతులు, బడుగు, బలహీన వర్గాలైన మహిళలపై కూడా తన ప్రతాపం చూపిస్తున్నారు. ఎన్నికల సంఘాని (ఈసీ)కి చంద్రబాబు అండ్ కో ఇచ్చిన తాజా ఫిర్యాదుతో రాష్టంలో అమలవుతున్న విద్యా దీవెన, రైతు ఇన్‌పుట్ సబ్సిడీ, జగనన్న చేయూత పథకం నిధుల విడుదలకు ఈసీ నిరాకరించింది. ఇవి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలే అని, వీటి వల్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగదని వైసీపీ చెబుతున్నా ఈసీ మాత్రం ససేమిరా నిధుల విడుదలకు అంగీకరించడం లేదు. దీనిపై ఆయా పథకాల లబ్ధిదారుల కోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. నిధుల విడుదల వాయిదా పడితే తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ALSO READ: ఏపీకి రాజధానిని లేకుండా చేసిన ‘పాపం’ చంద్రబాబుది కాదా?

ప్రభుత్వం మీద ఈసీ కక్షసాధింపు!

2023 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద 847 కోట్ల రూపాయలను 6,95,897 మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇది ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులకు ఈ సమయంలో నగదును అందిస్తే ఉపయోగపడుతుందని, ఎన్నికల కోడ్‌కు ముందే ప్రభుత్వం విడుదలకు సిద్ధమైంది. కానీ సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. ఆలోగా ఎన్నికల కోడ్ వచ్చింది. అయినా అమల్లో ఉన్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని, ఈసీ తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును ప్రభుత్వం వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ దఫా నిధుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసీ తాజా నిర్ణయంతో వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘జగనన్న చేయూత’ పథకం లబ్ధదారులైన అక్కచెల్లెమ్మలు సైతం ఈసీ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button