తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

AP Elections: ఎల్లుండి నుంచే సీఎం వైఎస్ జగన్‌ ఎన్నికల ప్రచారం.. ప్రతి రోజూ మూడు బహిరంగ సభలు!

వైసీపీ అధినేత, సీఎం జగన్ ఏప్రిల్ 28 నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న సీఎం జగన్ 15 రోజులు..45 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

ALSO READ: టీడీపీ కూటమిలో మొదలైన ఓటమి భయం!

ఒకరోజుకు ముందే మేనిఫెస్టో..

ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 1 వరకు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈ మేరకు 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక రోజు ముందే ఏప్రిల్ 27న వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

ALSO READ: పులివెందులలో సీఎం జగన్ పర్యటన.. అక్కడే నామినేషన్!

రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం..

దేశ రాజకీయ చరిత్రలో సీఎం జగన్‌ బస్సు యాత్ర అరుదైన ఘట్టంగా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. మార్చి 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో చేపట్టిన ఈ యాత్ర ఏప్రిల్ 24న శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2,188 కిమీ మేర సాగిన బస్సు యాత్రకు జనాలు బ్రహ్మరథం పట్టారు. కాగా, అంతకుముందు వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జనసంద్రాలను తలపించాయి.

12 Comments

  1. రైతు రుణమాఫీ చేస్తే మనకు తిరుగు ఉండదు

  2. జయహో జగన్ అన్న ప్రతి మునిసిపాలిటీ లో ఒక పార్క్ దీని ద్వారా చిన్నపిల్లలు వృదులు అదే విధం గా ప్రజలందరికీ హెల్తు పరంగా బాగుంటుంది మరియు old water ponds will renovetas ysr park

  3. రైతు రుణమాఫీ చేయాలి అన్నయ్య ఆలాగే ఖాళీగా ఉన్న సచివాలయం పోస్ట్లు ఫుల్ ఫీల్ చేయాలి అన్న నిరుద్యోగబిరుద్ది ఇవ్వాలి అన్న మనకు తిరుగుండదు పక్క వైస్సార్సీపీ జెండా ఎగరావేస్తామ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button